ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్-సీఎస్కే మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి హోంగ్రౌండ్ లో గెలిచి సత్తా చాటింది. 166 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో మార్క్రమ్ (50) హాఫ్ సెంచరీతో రాణించాడు. అలాగే ఓపెనర్లు.. ట్రేవిస్ హెడ్ 31, అభిషేక్ శర్మ 37 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు. షాబాజ్ అహ్మద్ 18,…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కేసీఆర్ పూర్తి రాజకీయ దురద్దేశంతో ఆరోపణలు చేశారని.. కేసీఆర్ మాటల్లో అసత్యాలు, నిరాధారమైన ఆరోపణలు తప్పా ఒక్కటి నిజం లేదని మండిపడ్డారు. కేసీఆర్ కు అధికారం పోయిందనే బాధ ఆయన మాటల్లో, ఆయన ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. తాను బీఆర్ఎస్ తప్పులను ఎత్తిచూపితే.. కేసీఆర్ అధికారం పోయిన ఫ్ట్రస్టేషన్ లో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. తాను వాళ్ల భూభాగోతాల్ని,…
ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై రెండు మూడు రోజుల్లో స్పందిస్తానని తెలిపారు. పదేళ్ళపాటు సీఎంగా ఉన్నాను... కచ్చితంగా క్లారిటీ ఇస్తానని కరీంనగర్ పర్యటనలో ఉన్న ఆయన సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో చిట్ చాట్ లో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిజానిజాలు బయటపెడతానని కేసీఆర్ పేర్కొన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా... సన్ రైజర్స్-సీఎస్కే మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నై బ్యాటర్ల దూకుడును ఆపారు. ముఖ్యంగా.. శివం దూబే క్రీజులో ఉన్నంతసేపు సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఒకానొక సమయంలో స్కోరు 200+ రన్స్ చేస్తుందని అనుకున్నారు. కానీ.. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోరును చేయనీయకుండా ఆపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పొలంబాట కార్యక్రమంపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ రైతుల సమస్యలను పట్టించుకోలేదని.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఆయన ఒక్క రైతును పరామర్శించలేదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసి జైలుకి పంపించిన ఘనత కేసీఆర్ సర్కార్ కే దక్కిందని విమర్శించారు.
కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి ఇవ్వాలని అంటే.. ఓ కాంగ్రెస్ మంత్రి నిరోధ్లు, పాపడాలు అమ్ముకుని బతకమని అంటున్నారని కేసీఆర్ తెలిపారు. చేనేత కార్మికులు నిరోధ్లు అమ్ముకోవాలా కుక్కల కొడుకుల్లారా అంటూ విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో తామేమి రనౌట్ కాలేదు.. తమకంటే కాంగ్రెస్ కు 1.5 శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయని తెలిపారు. ఆ ఒకటిన్నర శాతం ఓట్లు కూడా తులం బంగారం, ఆరు గ్యారెంటీలు, లేడీస్ కి స్కూటీలు లాంటి…
ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయింది అనే అసహనం కేటీఆర్ లో ఉంది.. మరో వైపు చెల్లె జైల్లో ఉందని ఆరోపించారు. ట్యాపింగ్ చేశాం అని కేటీఆర్ ఒప్పుకోవాలని మంత్రి సీతక్క తెలిపారు. విచారణలో వాళ్ళ బంధువులే నిజాలు చెప్తున్నారు.. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఒప్పుకున్నాడు.. తప్పుకు శిక్ష అనుభవిస్తారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు అనే వైపు విచారణ జరగాలని మంత్రి సీతక్క కోరారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. చెన్నై బ్యాటింగ్ కు దిగనుంది. ఇదిలా ఉంటే.. ఎస్ఆర్ హెచ్ కు ఉప్పల్ స్టేడియం హోంగ్రౌండ్ అయినప్పటికీ, చెన్నైకు సపోర్ట్ గా మారింది.
కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల ఈ పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వ మాటలు అన్నీ మోసాలు.. అబద్ధాలు.. ఒక్క హామీ నెరవేరలేదని తెలిపారు. అసమర్థులు, చవట దద్దమ్మలు పాలనలో ఉన్నారు కాబట్టి ఈ స్థితి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కరువుతో పంటలు ఎండిపోయాయని పేర్కొన్నారు. 15…
రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు, ప్రజాస్వామ్యాన్ని అర్థవంతంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కోరారు. యువకులు, పట్టణ ఓటర్లు ఎన్నికల ప్రక్రియ పట్ల ఉదాసీనత వంటి వివిధ కారణాల వల్ల వరుసగా జరిగిన ఎన్నికల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం మరింత తగ్గకుండా సీఈవోలు కృషి చేయాలని ఆయన కోరారు. ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ప్రధాన…