కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల ఈ పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వ మాటలు అన్నీ మోసాలు.. అబద్ధాలు.. ఒక్క హామీ నెరవేరలేదని తెలిపారు. అసమర్థులు, చవట దద్దమ్మలు పాలనలో ఉన్నారు కాబట్టి ఈ స్థితి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కరువుతో పంటలు ఎండిపోయాయని పేర్కొన్నారు. 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. నీటి నిర్వహణ సామర్ధ్యం, నాణ్యమైన కరెంట్ ఇవ్వకపోవడం వల్లనే ఎండిపోయాయని కేసీఆర్ తెలిపారు.
Election Commission: ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈసీ ముందడుగు..
మరోవైపు.. సిగ్గులేకుండా ఈరోజు మరో 5 గ్యారంటీ హామీలు ఇచ్చారు.. కొందరు చేతకాని మంత్రులు కాలం కాలేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఇవ్వడంలో వైఫల్యం చెందారు.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 25 లక్షల సాయం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. పంటలు ఎండిన వారికి ఎకరాకు 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. సాగర్ లో నీళ్లున్నా ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తాము కరీంనగర్ వస్తున్న అనగానే… కూలిపోయింది అన్న కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. నీళ్లు వదలాలి అని కేసీఆర్ చెప్పాలి అంటున్నాడు ముఖ్యమంత్రి.. నీళ్లు వదలడం తెలియని నువ్వా సీఎం.. నేనా సీఎం అని విమర్శించారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తా అన్నాడు సీఎం… ఏమైంది అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల కరీంనగర్ కి ఏ కాలంలో అయినా ఢోకా ఉండదు అని చెప్పినం… చేసి చూపించామన్నారు కేసీఆర్. మానేరు వాగు నిత్యం నీటితో కళకళ లాడేలా చేశాం.. వరద కాలువను ఒకటిన్నర టీఎంసీలతో సజీవ జలాధారగా మర్చాము.. సాగునీటి ఫలితాలు అనుభవించిన కరీంనగర్ ప్రజలు నాలుగు నెలల్లోనే ఏం జరిగిందో చూసారని తెలిపారు. మధ్య మానేరు బ్యారేజీ ఎండిపోయింది.. మునిగిన ఊర్లు తేలి స్మశానం లాగా మారిందని పేర్కొన్నారు. లోయర్ మానేరు ఎండిపోయి కరీంనగర్ లో నీటి కరువు వచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు.
Yatra 2 OTT: ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైన యాత్ర 2
మీ వెర్రి వేషాలు, పాగల్ మాటల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం వచ్చే పరిస్థితి ఉందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తాం అన్నారు… జొన్న పంట సగమే కొంటాం అంటున్నారు.. మీరు పంటలకు బోనస్ ఇవ్వకపోతే మీకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని కేసీఆర్ ఆరోపించారు. గొర్రెల యూనిట్ల కోసం వందల కోట్లు డీడీలు కట్టిన యాదవులను మోసం చేశారన్నారు. దళిత సోదరులు దళిత బంధు కోసం కాంగ్రెస్ ని నిలదీయండని తెలిపారు. కల్యాణ లక్ష్మీకి తోడు తులం బంగారం ఇస్తామన్నారు.. మీకు బంగారం దొరుకుత లేదా? అని ప్రశ్నించారు. వృద్ధాప్య పెన్షన్లు మీ ఇందిరమ్మ రాజ్యంలో 200 ఉంటే 2వేలు చేశాం.. నాలుగు వేలు పెంచుతాం అన్నారు.. 30 లక్షల మందిని మోసం చేశారని దుయ్యబట్టారు. మీరన్న రెఫరెండంకి వృద్ధాప్య పెన్షనర్లు కర్రు కాల్చి వాతపెడతారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.