కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి ఇవ్వాలని అంటే.. ఓ కాంగ్రెస్ మంత్రి నిరోధ్లు, పాపడాలు అమ్ముకుని బతకమని అంటున్నారని కేసీఆర్ తెలిపారు. చేనేత కార్మికులు నిరోధ్లు అమ్ముకోవాలా కుక్కల కొడుకుల్లారా అంటూ విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో తామేమి రనౌట్ కాలేదు.. తమకంటే కాంగ్రెస్ కు 1.5 శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయని తెలిపారు. ఆ ఒకటిన్నర శాతం ఓట్లు కూడా తులం బంగారం, ఆరు గ్యారెంటీలు, లేడీస్ కి స్కూటీలు లాంటి మీ మోసపూరిత వాగ్దానాల వల్ల వచ్చాయి అని పేర్కొన్నారు.
CPI: ఏపీలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటించిన సీపీఐ
రైతుల కోసం దేశంలో ఎవరు చేయని పనులు చేశాం.. రైతు బంధు ఇచ్చాం.. రైతు బీమా ఇచ్చామని కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వీళ్లకు తోక తెలియదు తొండం తెలియదని విమర్శించారు. కాళేశ్వరం పని అయిపోయింది అన్నోళ్లు మొన్న నీటిని ఎలా పంపింగ్ చేశారని దుయ్యబట్టారు. తాము వచ్చి పనులు చేస్తుంటే మిడ్ మానేరు కట్ట కొట్టుకుపోయింది.. ఆ మిడ్ మానేరు కట్ట కట్టింది కోమటిరెడ్డి కంపెనీ… తాము కోమటిరెడ్డిని జైల్లో పెట్టకపోదుమా..? అని ప్రశ్నించారు. గోదావరిలో నీళ్లు లేక ఆరు నెలలు వ్యాప్కోస్ తో కలిసి కష్టపడి ప్రాజెక్ట్ డిజైన్ చేశామన్నారు. ఏ టైంలో నీళ్లు నిల్వ చేసి ఎత్తిపోయాలో ఆలోచించి పని చేస్తే మే నెలలో మత్తళ్ళు దూకినాయని పేర్కొన్నారు. అప్పటి ఇంజనీర్లని అడిగితే మమ్మల్ని నిరోధించారు అంటున్నారు.. పిల్లర్ల కింద ఇసుక కదిలి రెండు పిల్లర్లు కుంగినయ్ నదుల్లో ఇది సహజం అని తెలిపారు.
Seethakka: ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..
వీళ్లకు చేతగాకపోతే 50 వేల మంది రైతుల్ని తీసుకుని వీళ్లను తొక్కుకుంటా పోయి కుర్చీ వేసుకుని కూర్చుని మేడిగడ్డ నుంచి నీటిని తెస్తామని కేసీఆర్ తెలిపారు. తాము హైదరాబాద్ సహా రాష్ట్రమంతా ఒక్క రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చాం నీళ్లు ఇచ్చామన్నారు. ఇప్పుడు మళ్లీ రోడ్ల మీదికి బిందెలు వస్తున్నాయి… ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి.. ట్యాంకర్లు ఫ్రీగా సప్లై చేయండి… మిషన్ భగీరథ తిరిగి నడపండి అని అన్నారు. వెంటనే చర్యలు చేపట్టి 25 వేలు ఎకరాకు పరిహారం ఇవ్వాలి.. 500 బోనస్ ఇవ్వాలని కోరారు. కేసీఆర్ బయలుదేరాడు ఇక ఆగడు… ఒక్క జిల్లా రెండు జిల్లాలు కాదు.. ఎక్కడ సమస్య వున్నా.. అక్కడ గద్దలాగా వాలిపోతానని తెలిపారు.