ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై రెండు మూడు రోజుల్లో స్పందిస్తానని తెలిపారు. పదేళ్ళపాటు సీఎంగా ఉన్నాను… కచ్చితంగా క్లారిటీ ఇస్తానని కరీంనగర్ పర్యటనలో ఉన్న ఆయన సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో చిట్ చాట్ లో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిజానిజాలు బయటపెడతానని కేసీఆర్ పేర్కొన్నారు.
అంతకుముందు పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యుత్ కొరతపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పవర్ షార్టేజ్ ఎందుకు అవుతోంది? అంటే మీరు పక్కా చవటలు, దద్దమ్మలు, చేతగాని చవటలు’ అని దుయ్యబట్టారు. అంతకుముందు ఇదే పరిస్థితి ఉంటే ఏడాదిలో తాము అంతా క్లియర్ చేశామని.. కాంగ్రెస్ పార్టీ వల్లే పీఆర్ స్టంట్లు చేయలేదన్నారు. అలాంటప్పుడు మేం అసమర్థులం… ప్రభుత్వం నడపడం చేతకాదని అంగీకరించాలని కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read Also: Chandrababu: కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
మరోవైపు.. తాము పర్యటిస్తున్నామని తెలిసి కూలిపోయింది అన్న కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేస్తున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానన్న సీఎం… ఏమైంది అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల కరీంనగర్ కి ఏ కాలంలో అయినా ఢోకా ఉండదు అని చెప్పాం… చేసి చూపించామన్నారు కేసీఆర్. మానేరు వాగు నిత్యం నీటితో కళకళ లాడేలా చేశాం.. వరద కాలువను ఒకటిన్నర టీఎంసీలతో సజీవ జలాధారగా మర్చాము.. సాగునీటి ఫలితాలు అనుభవించిన కరీంనగర్ ప్రజలు నాలుగు నెలల్లోనే ఏం జరిగిందో చూసారని తెలిపారు. మధ్య మానేరు బ్యారేజీ ఎండిపోయింది.. మునిగిన ఊర్లు తేలి స్మశానం లాగా మారిందని పేర్కొన్నారు. లోయర్ మానేరు ఎండిపోయి కరీంనగర్ లో నీటి కరువు వచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు.