ఒకటి, రెండు రోజుల వయస్సులోపు శిశువుల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా సీబీఐ బట్టబయలు చేసింది. ఢిల్లీ, హర్యానాలో జరిపిన దాడుల్లో 1.5 రోజులు, 15 రోజులు, ఒక నెల వయసున్న ముగ్గురు శిశువులను సీబీఐ ముఠా బారి నుంచి రక్షించింది. వీరిలో ఇద్దరు మగ శిశువులు, ఒక నెల వయసున్న ఆడ శిశువు ఉన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ స్టేడియంలో.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో.. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.
చాలా ప్రశాంతమైన క్రికెటర్లలో రోహిత్ శర్మ ఒకరు. అతను ఎప్పుడు కూల్గా, ప్రశాంతంగా ఉంటారు. ఫీల్డ్లో కూడా చాలా కూల్ గానే కనిపిస్తాడు. క్రికెట్ పరంగా కాకున్నా.. నిజ జీవితంలో కూడా చాలా కూల్గా ఉంటాడు. అంతేకాకుండా.. తాను తోటి క్రికెటర్లతో కానీ, ఫ్యామిలీతో కానీ స్పెండ్ చేసినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో మనం వీడియోల్లో చూస్తుంటాం. కాగా.. రోహిత్ శర్మకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అభిమానులకు నోటిపై వేలు పెట్టి చూపిస్తూ ప్రశాంతంగా…
సన్రైజర్స్ అభిమానులకు ఇదొక భారీ షాక్ అని చెప్పాలి. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఎడమ మడమ నొప్పి కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమైనట్లు ESPNcricinfo తెలిపింది. కాగా.. మినీ వేలంలో హసరంగను రూ. 1.5 కోట్లకు హైదరాబాద్ దక్కించుకుంది. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా రిస్క్ తీసుకోకూడదని శ్రీలంక అతడికి పూర్తి విరామం ఇచ్చింది. ప్రస్తుతం హసరంగ శ్రీలంకలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఐపీఎల్ తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ను గాయాలు వదలడం లేదు. ఇప్పటికే జట్టు వరుస ఓటములతో ఇబ్బంది పడుతుండగా.. జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం అవుతున్నారు. తాజాగా.. మరో స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ దూరం కానున్నారు. గాయం కారణంగా ముంబైతో జరిగే మ్యాచ్కు ఆడటం కష్టమేనని టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ తెలిపారు. అంతేకాకుండా.. అతను కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుందో చెప్పలేదు. కాగా.. ఈసీజన్ లో నాలుగు మ్యాచ్లు ఆడిన మార్ష్.. 71 పరుగులు చేశాడు. బౌలింగ్లో ఒక వికెట్…
సన్రైజర్స్ హైదరాబాద్ డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మపై మాజీ క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ మరోసారి ఫైర్ అయ్యారు. ఇంతకుముందు చెప్పు చూపి బెదిరించగా.. ఇప్పుడు నీకు తన్నులు తప్పేలా లేదన్నట్లుగా ఓ మీమ్ షేర్ చేశాడు. మరోసారి "చెత్త షాట్ ఆడి ఔటయ్యావు’’ అంటూ ఓ వ్యక్తి కర్ర చేతిలో పట్టుకుని మరో వ్యక్తిని తరుముతున్నట్లుగా ఉన్న మీమ్ ఒకటి షేర్ చేశాడు. కాగా.. యువరాజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న (శుక్రవారం) ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ బిగ్ ఫైట్ ను చూసేందుకు ఆరెంజ్ ఆర్మీతో పాటు.. సీఎస్కే ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున వచ్చారు. ముఖ్యంగా ధోనీని చూసేందుకు చాలా మంది అభిమానులు.. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. అయితే.. ఈ మ్యాచ్ ను లైవ్ లో చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వచ్చిన ధోనీ అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. హ్యాపీగా సీటులో కూర్చుని మ్యాచ్ ను ఎంజాయ్…
కాకుల్లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ (ASPT)లో పాకిస్తానీ క్రికెటర్ల ఆర్మీ శిక్షణా కొనసాగుతుంది. శిక్షణా శిబిరంలో వారంతా కొండలపై రాళ్లను మోస్తూ కనిపించారు. మొత్తం 29 మంది ఆటగాళ్లు కఠినమైన ఫిట్‌నెస్ సాధించేదుకు కసరత్తులు చేస్తున్నారు. కొత్తగా నియమించబడిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ జట్టు యొక్క ఫిట్‌నెస్ స్థాయిలలో గణనీయమైన మెరుగుదల.. స్థిరంగా బౌండరీలు కొట్టే వారి పవర్-హిటింగ్ సామర్థ్యాన్ని చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న (శుక్రవారం)సన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి హోంగ్రౌండ్లో గెలిచి సత్తా చాటింది. కాగా.. ఈ మ్యాచ్తో చెన్నై వరుసగా రెండు ఓటములను నమోదు చేసుకుంది. మ్యాచ్ జరిగింది హైదరాబాద్లో అయినప్పటికీ.. అభిమానులు అందరూ చెన్నైకి సపోర్ట్ చేశారు. అయినా చెన్నై విజయం సాధించలేకపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ స్టేడియంలో తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కి ఇది నాలుగో మ్యాచ్ కాగా.. బెంగళూరుకు ఐదో మ్యాచ్. కాగా.. ఈ సీజన్లో మూడింటిలో మూడు గెలిచి రాజస్థాన్ మంచి ఫామ్లో ఉంది. రాజస్థాన్ వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఇక.. బెంగళూరు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 ఓటములను చవి చూసింది.