ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయింది అనే అసహనం కేటీఆర్ లో ఉంది.. మరో వైపు చెల్లె జైల్లో ఉందని ఆరోపించారు. ట్యాపింగ్ చేశాం అని కేటీఆర్ ఒప్పుకోవాలని మంత్రి సీతక్క తెలిపారు. విచారణలో వాళ్ళ బంధువులే నిజాలు చెప్తున్నారు.. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఒప్పుకున్నాడు.. తప్పుకు శిక్ష అనుభవిస్తారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు అనే వైపు విచారణ జరగాలని మంత్రి సీతక్క కోరారు.
Memantha Siddham Bus Yatra: మేమంతా సిద్ధం బస్సు యాత్ర 9వ రోజు షెడ్యూల్ ఇదే..
కేసీఆర్ వచ్చాకా ఇంటలిజెన్స్, పోలీసు వ్యవస్థ అంతా ప్రతిపక్షం మీదనే ఫోకస్ అని సీతక్క ఆరోపించారు. ట్యాపింగ్ చేసిన వాటిపై కేసీఆర్ రోజు సాయంత్రం సమాచారం తెచ్చుకునే వారని.. ఫోన్ ట్యాప్ వెనకాల కేసీఆర్ కుటుంబం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఆ నలుగురే బాధ్యులని.. వాస్తవాలు బయటకు వస్తున్నాయని.. పొలం బాట పట్టారు కేసీఆర్ అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నుండి బయట పడేందుకు రైతు ముసుగు వేసుకుంటున్నరని దుయ్యబట్టారు. లిక్కర్ దందా, ఫోన్ ట్యాపింగ్ నుండి బయట పడేందుకు బీఆర్ఎస్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ కేసు విషయంలో మాత్రం అటు అధికార.. ఇటు ప్రధాన ప్రతిపక్షాల నడుమ మాటలు యుద్ధం కొనసాగుతోంది.
USA: భారతీయ విద్యార్థిని కాల్చి చంపిన కేసులో నిందితుడికి మరణశిక్ష అమలు..