లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా.. కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా.. ముగ్ధుంపురంలో ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. నీటి సమస్యలపై రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంపై కేసీఆర్ ఆరా తీశారు. అయితే.. సాగునీటికి తీవ్ర ఇబ్బంది అవుతుందని రైతులు కేసీఆర్ కు తెలిపారు. గతేడాది నీరు సమృద్ధిగా ఉండేదని.. ఇప్పుడు పొలమంతా ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీళ్లకు…
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వద్ద 15 గ్రాముల డ్రగ్స్ ను మాదాపూర్ ఎస్ఓటీ టీమ్ సీజ్ చేశారు. కారులో డ్రగ్స్ తరలిస్తుండగా మాటు వేసి పట్టుకున్నారు ఎస్ఓటీ అధికారులు. ఆ తర్వాత నిందితుడు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎస్ఓటీ బృందం.. నిందితుడు పాత నేరస్థుడుగా గుర్తించారు. దీంతో.. అతనిపై (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. నిందితుడు రాజేంద్రనగర్ సన్ సిటీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జయ్ చంద్గా గుర్తించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీమంత్రి హరీష్ రావు లేఖ రాశారు. మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి.. మళ్ళీ ప్రజలను మోసం చేయొద్దు అని సూచించారు. మీ నాయకత్వంలోనే 2004, 2009 ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలను గుప్పిస్తూ మేనిఫెస్టోలను విడుదల చేశారు.. రెండు సందర్భాల్లోనూ అటు కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో మీరే అధికారంలోకి వచ్చారు. కానీ అప్పుడు ఇచ్చిన హామీలు వేటిని అమలు చేయలేదని లేఖలో ప్రస్తావించారు. 2023లో కూడా తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు.. ఆ…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సమక్షంలో ఎంబీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా.. తెలంగాణ ప్రజల ఓట్లను అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు గెలుకోలేదని విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో బీజేపీకి 90 శాతం, హిమాచల్ ప్రదేశ్ లో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. సన్ రైజర్స్కు ఉప్పల్ హోంగ్రౌండ్. అయితే.. అక్కడ ఆ పరిస్థితులు కనపడటం లేదు. ఉప్పల్ స్టేడియం చుట్టూ పసుపుమయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా పసుపు జెర్సీలే కనపడుతున్నాయి. దానికి కారణమేంటంటే.. సీఎస్కే జట్టులో ధోనీ ఉండటం. ధోనీ అంటే.. క్రికెట్ అభిమానులకు ఎంతో అభిమానం. అందుకోసమని తమ టీమ్ ను కాదని..…
మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పాపన్నపేటలో నిర్వహించిన ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. పంటలు చేతికొచ్చినా రైతుబంధు రాలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడంటే అప్పుడు నీళ్లు ఇచ్చామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని వ్యవసాయం మీద దృష్టి పెట్టమంటే.. వలసల మీద దృష్టి పెట్టాడని విమర్శించారు. కాంట్రాక్టర్లకు నిధులు ఇచ్చి.. కమిషన్లు కొట్టి రైతులకు మాత్రం…
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన ఉత్కంఠపోరులో పంజాబ్ విజయం సాధించింది. చివరి బంతికి శశాంక్ సింగ్ గెలిపించాడు. ఈ మ్యాచ్ లో సూపర్ హీరో శశాంక్ సింగ్ (62*) పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించాడు. 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ చివరి బంతికి విజయం సాధించింది.
అవినీతి, లంచగొండితనాన్ని అరికట్టేందుకు సీబీఐ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆగడాలు ఆగటం లేదు. తాజాగా.. లంచం కేసులో అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఓ), సబార్డినేట్ ఉద్యోగిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరందరినీ డ్రగ్ కంట్రోలర్ (ఇండియా) కార్యాలయంలో నియమించారు. వీరంతా లంచం తీసుకున్న ఆరోపణలపై అరెస్టు చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు.. ఏప్రిల్ 8 వరకు పోలీసు కస్టడీకి తరలించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. గుజరాత్ బ్యాటింగ్ లో కెప్టెన్ శుభ్మాన్ గిల్ రాణించాడు. కేవలం 48 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 6 ఫోర్లు ఉన్నాయి.
ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ అధికారులు కరెంట్ సరఫనా నిలిపివేశారు. అయితే కొన్ని నెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడం వల్లనే పవర్ కట్ చేశారు. ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు విద్యుత్ బిల్లులు చెల్లించకుండా రూ.1.67 కోట్లు విద్యుత్ వాడుకున్నారని విద్యుత్ శాఖ తెలిపింది. కాగా.. కొన్ని నెలలుగా బిల్లులు కట్టకపోవడంతో పవర్ కట్ చేశామని విద్యుత్ అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. రేపు(శుక్రవారం) హైదరాబాద్, చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. అందుకోసమని.. స్టేడియంలో ఆ జట్లు ప్రాక్టీస్ చేస్తుండగా విద్యుత్ నిలిపివేశారు. దీంతో.. ఇప్పుడు అభిమానులు…