కృష్ణా జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తోట నరసింహంకు మద్దతుగా ఆయన తనయుడు రాంజీ ప్రచారం నిర్వహించారు. గోకవరం మండలం మల్లవరం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి తన తండ్రిని ఆశీర్వదించాలని కోరారు. గతంలో తోట నరసింహం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగ్గంపేట అభివృద్ధిలో ముందు ఉందని గుర్తు చేశారు. జగన్ మళ్ళీ సీఎం అయితేనే సంక్షేమం, అభివృద్ధి ఫలాలు పేదలకు అందుతాయని అన్నారు. గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.…
చైనాతో పాటు ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి హడలెత్తించిన సంగతి తెలిసిందే.. చైనాలో ఈ మహమ్మారి కారణంగా లక్షలాది మంది చనిపోయారు. అదే సమయంలో.. అంటువ్యాధి కారణంగా సంభవించే మరణాల నుండి చైనా గుణపాఠం నేర్చుకుంది. ఈ క్రమంలో.. దేశంలో ఐసియు పడకల సంఖ్యను పెంచాలని చైనాకు చెందిన అనేక ఏజెన్సీలు సోమవారం తెలిపాయి. 2025 నాటికి దేశంలో 100,000 మందికి 15 ఐసీయూ పడకలు, 2027 నాటికి 18 ఉండాలని ఏజెన్సీలు తమ ప్రతిపాదనలో పేర్కొన్నాయి.
అనకాపల్లి జిల్లా తాళ్ళపాలెంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో ప్రజా గళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం జెండా రెపరెపలాడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో వికసిత ఆంధ్రప్రదేశ్ - వికసిత భారత్ సాధ్యం అన్నారు. అభివృద్ది చెందుతున్న భారత్ నినాదంతో జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని మోడీ తెలిపారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం మేమంతా సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరుగుతోంది.. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నిక కోసం జరిగే ఎన్నికలు కాదన్నారు. ఇంటింటికి భవిష్యత్లో పథకాల కొనసాగింపు కోసం జరిగే ఎన్నికలని సీఎం జగన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో అమలు కాని హామీలు అని విమర్శించారు. చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమేనని ఆరోపించారు. చంద్రబాబును నమ్మటం…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తాను చేసిన మంచి గురించి చెప్పే దమ్ము లేదని ఆరోపించారు. కొంత మంది మాజీ అధికారులను ప్రభుత్వంపై విషం చిమ్మెలా ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. పీవీ రమేష్ ఐఏఎస్గా పని చేశాడు.. ఇంత దిగజారి ప్రవర్తించాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టర్ గారు కొందరు రైతులతో కలిసి ఉమ్మడిగా లీజుకు ఇచ్చారన్నారు. 70 ఎకరాల పొలాన్ని 20 ఏళ్ల క్రితమే చెరువు తవ్వి…
రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను విస్మరించిందని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్లోని వైఎన్ఆర్ గార్డెన్స్లో భారతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆటో డ్రైవర్లు, లైట్ వెయిట్ మోటార్ వెహికల్ డ్రైవర్లతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం ప్రతి నెల జీవన భృతి కల్పిస్తామని చెప్పి మాట తప్పిందని ఆరోపించారు. తాను చేవెళ్లలో ఎంపీగా విజయం…
మోడీ గుండెలో బండి సంజయ్ కి ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ అభ్యర్థి అన్నమలై అన్నారు. సౌతిండియాలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కు జాతీయ పదవిచ్చారని తెలిపారు. యూత్ ఐకాన్... సంజయ్ అని కొనియాడారు. బండి సంజయ్ స్పూర్తితోనే తాను తమిళనాడులో పాదయాత్ర చేసినట్లు అన్నామలై తెలిపారు. ఈ ఎన్నికల్లో 60 శాతం ఓట్లతో సంజయ్ ను గెలిపించండని.. బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లేనని అన్నామలై పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొని.. అక్కడ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మహబుబాబాద్ జిల్లా పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ పై ప్రజల ఆశీస్సులుండాలని తెలిపారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చిన పార్టీ బీజేపీ అని అన్నారు. సీతారాం నాయక్ పనితీరు మీకు తెలుసు.. ఆదివాసీ, గిరిజన ప్రజలకు అండగా ఉంటాడన్నారు.
తెలుగుదేశం గెలుపు ప్రగతికి మలుపుని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఉదయగిరి యూత్ ఆధ్వర్యంలో టీడీపీకి మద్దతుగా స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ర్యాలీలో కాకర్ల సురేష్ పాల్గొన్నారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా పాలిస్తున్న పాలకులు ఉదయగిరి ప్రాంతాన్ని సర్వనాశనం చేశారన్నారు. ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమన్నారు. మరోవైపు.. తెలుగుదేశం యువత ర్యాలీకి బ్రహ్మ రథం పట్టారు. ఉదయగిరి బస్టాండ్ నుండి తెలుగు దేశం అనుబంధ సంఘాల యువత ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో…