ఎన్నికల ప్రచారంలో ఉదయగిరి నియోజక వర్గం ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ దూసుకుపోతున్నారు. అందులో భాగంగా.. పలువురు టీడీపీలో చేరుతున్నారు. ఈ క్రమంలో.. ఉదయగిరి మండల కేంద్రంలోని సికిందర్ సినిమా హాలు సెంటర్ సంబంధించిన పది ముస్లిం కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉదయగిరి టీడీపీ మండల నాయకత్వంలో గాజుల బాబు ఆధ్వర్యంలో.. మన్నేటి వెంకటరెడ్డి సారధ్యంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ముస్లింలకు అన్ని విధాల అండగా ఉన్న ప్రభుత్వం టీడీపీ అని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ముస్లిం సోదరి సోదరీమణులకు జరిగిన లబ్ధి గురించి వివరించారు. మే 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పై రెండవ గుర్తు సైకిల్ అని రెండు ఓట్ల సైకిల్ పై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. మరోవైపు.. ఉదయగిరి మండలం కృష్ణంపల్లి గ్రామానికి చెందిన బేరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బా,బు యాదవ్ మన్నేటి వెంకటరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని పరిశీలించిన కాకర్ల..
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉదయగిరి నియోజక వర్గం ఉదయగిరి జూనియర్ కాలేజీ నందు ఏర్పాటు చేసిన ఫెసిటిలేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఆదివారం 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఉదయం7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సర్వీస్ ఓటర్లు ఈ సెంటర్లల్లో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా అసెంబ్లీ, పార్లమెంటుకు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. ఆదివారం జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని కాకర్ల సురేష్ పరిశీలించారు. తెలుగుదేశం గెలుపు ప్రగతికి మలుపుని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఉదయగిరి యూత్ ఆధ్వర్యంలో టీడీపీకి మద్దతుగా స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ర్యాలీలో కాకర్ల సురేష్ పాల్గొన్నారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా పాలిస్తున్న పాలకులు ఉదయగిరి ప్రాంతాన్ని సర్వనాశనం చేశారన్నారు. ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమన్నారు. మరోవైపు.. తెలుగుదేశం యువత ర్యాలీకి బ్రహ్మ రథం పట్టారు. ఉదయగిరి బస్టాండ్ నుండి తెలుగు దేశం అనుబంధ సంఘాల యువత ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఉదయగిరి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి కాకర్ల సురేష్, మరదలు కాకర్ల సురేఖ, ఆమె కుమార్తె అస్మిత పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉదయగిరి బస్టాండ్ నుండి అన్ని దుకాణ దారులతో మాట్లాడుతూ రాబోవు ఎన్నికలలో కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
దుత్తలూరులో తెలుగుదేశం ప్రచారం ప్రభంజనం..
ఉదయగిరి నియోజకవర్గ ప్రజల హృదయాలలో పదిలంగా కాకర్ల సురేష్ ఉన్నారు. ఆయన చేపట్టిన పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి గ్రామ గ్రామాల నుండి పసుపు జెండాలతో కలసి వచ్చి మమత మమకారాల చేత మంగళహారతులచేత సోదర భావాల చేత ఆదరభిమానాలతో స్వాగతం పలకడమే అందుకు నిదర్శనం. ఆదివారం దుత్తలూరు మండలంలో నిర్వహించిన పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కొత్తపేట, వెంగనపాలెం, తిమ్మాపురం, వడ్డీ పాలెం, తెడ్డుపాడు, నర్రవాడ మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో దుత్తలూరు టీడీపీ నాయకత్వంలో మండల కన్వీనర్ వెంకటరత్నం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మరోవైపు.. కాకర్ల సురేష్ మాతృమూర్తి కాకర్ల మస్తానమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరిగి కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీ బిడ్డ మీ గడ్డపకు వస్తున్నారని ఓటు వేసి ఆదరించాలని కోరారు.
జలదంకి మండలంలో ప్రచారంలో పాల్గొన్న కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు..
ఆదివారం సాయంత్రం జలదంకి మండలం దాసరి అగ్రహారం, అన్నవరం గ్రామాలలో ఉదయగిరి ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్, నెల్లూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపు కొరకు కాకర్ల సునీల్, జలదంకి మండల టీడీపీ అధ్యక్షులు మధురెడ్డి, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు వంటేరు జయ చంద్రారెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ రైతు అధ్యక్షుడు పూనూరు భాస్కర్ రెడ్డి, టీడీపీ- జనసేన- బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ప్రచారం చేసారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంటేరు మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతంమైన ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి.. చంద్రబాబు నాయుడు సీఎం కావాలన్నారు. ఉదయగిరి నియోజవర్గం నుండి టీడీపీ జెండా ఎగరేయాలని, నెల్లూరు పార్లమెంటు నుండి ఎంపీ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి గెలుపొందాలని తెలిపారు. కావున ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి కాకర్ల సురేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.