ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ రథం సెంటర్ నుంచి చిట్టినగర్ వరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షైక్ అసిఫ్ ఆధ్వర్యంలో రోడ్డు షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు తాను వైసీపీ ముఖ్య నాయకులు అందరం కలిసి రోడ్డు షో నిర్వహించామని.. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. తప్పకుండా.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షైక్ అసిఫ్ మంచి మెజారిటీతో…
ఎన్నికల ప్రచారంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఆయనతో పాటు తన సతీమణి సీతారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఓ సభలో భావోద్వేగమైన ప్రసంగం చేశారు. రంజిత్ రెడ్డిని ఎందుకు మళ్ళీ గెలిపించాలో చెప్పారు. ప్రజాసేవకు ఆయన ఎంత పరితపిస్తారో.. తాను చూశానంటూ వెల్లడించారు. మంచి చేసిన నేతను మళ్ళీ భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.
జగ్గంపేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహం ప్రచారంలో స్పీడ్ పెంచారు. గోకవరం మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష కూటమి ఇచ్చే హామీలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. కొత్తపేట, లింగోజిగూడ డివిజన్లలోని రాజీవ్ గాంధీ నగర్, భరత్ నగర్, శివమ్మ నగర్, ఆర్టీసీ కాలనీ, మసీద్ గల్లీ పరిసర కాలనీలో నిర్వహించిన రోడ్ షో మరియు ప్రచార కార్యక్రమంలో ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మధు యాష్కీ గౌడ్, మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే.. పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న రాజస్థాన్, ఈ మ్యాచ్ లో గెలిచి అదే స్థానంలో కొనసాగాలని చూస్తోంది. మరోవైపు.. ఢిల్లీ ఈ మ్యాచ్ లో నెగ్గి ప్లేఆఫ్స్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది.
విశాఖలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓల్డ్ గాజువాకలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు ప్రకటించే ధైర్యం చేసింది జగనేనని తెలిపారు. విశాఖను రాజధానిగా చేయడమే కాదు.. జూన్ 4న ప్రమాణ స్వీకారం, పాలన చేసేది ఇక్కడ నుంచేనని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ భారీ బహిరంగ నిర్వహించింది. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఐదేళ్ళుగా పేదలపై భారం మోపుతూ.. బాదుడే బాదుడు అని ఆరోపించారు. ఏడుసార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు.. రెండు వందలు వస్తున్న కరెంట్ బిల్లు వెయ్యి దాటి రెండువేల వరకు వెళ్ళిందని పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు, పెట్రోలు ధరకు ఆఖరికి చెత్త పన్ను వేశాడని సీఎం జగన్ పై దుయ్యబట్టారు. ప్రతి ఎన్నికలకు ఏదో ఒక డ్రామా ఆడుతున్నాడని మండిపడ్డారు. ముస్లింల నాలుగు…
తీవ్ర ఎండలకు అల్లాడిపోతున్న ఏపీ జనం ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో.. ప్రజలు వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కొన్ని చోట్ల వాతావరణం చల్లబడగా.. మరికొన్ని చోట్ల వర్షం కురుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో.. నగరం అతలాకుతలం అయ్యింది.
ఏపీలో సంక్షేమ పథకాల నిధులు విడుదల నిలిపివేయాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో.. న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈసీ ఆదేశాలతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిలిచి పోయిందని పిటిషనర్ కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీలో కరువు మండలాల్లో రైతుల ఇబ్బందులను గుర్తించటానికి 2023లోనే ప్రభుత్వం కలెక్టర్లతో కమిటీ వేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. 108 కరువు మండలాల్లో 6.95 లక్షల రైతులను గుర్తించి గత ఏడాది అక్టోబర్లో కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్టు పిటిషనర్…
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు, పెత్తందారులకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. పేదల వైపు ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెత్తందారుల వైపు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి జగన్కు నష్టం చేయాలని చూస్తున్నాయని అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద పిల్లలు భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తెచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. పేదరికాన్ని తగ్గించడం…