పార్లమెంట్ ఎన్నికల్లో 400 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అధికార బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే అవకాశం ఉన్న ప్రతి స్థానంలో కీలక నేతలతో ప్రచారం చేస్తూ.. ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా.. రాజకీయ పార్టీల నేతలు, సెలబ్రేటీలు, కీలక నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే.. తమిళనాడు బీజేపీ అభ్యర్థి అన్నమలై ఈరోజు తెలంగాణలో పర్యటిస్తున్నారు. కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.
MI vs SRH: ముంబైతో మ్యాచ్.. హైదరాబాద్ ప్లేఆఫ్స్ ఛాన్స్‌కు ఎసరు వచ్చేనా?
జమ్మికుంటలో జరిగిన యువ సమ్మేళన కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. మోడీ గుండెలో బండి సంజయ్ కి ప్రత్యేక స్థానం ఉందన్నారు. సౌతిండియాలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కు జాతీయ పదవిచ్చారని తెలిపారు. యూత్ ఐకాన్… సంజయ్ అని కొనియాడారు. బండి సంజయ్ స్పూర్తితోనే తాను తమిళనాడులో పాదయాత్ర చేసినట్లు అన్నామలై తెలిపారు. ఈ ఎన్నికల్లో 60 శాతం ఓట్లతో సంజయ్ ను గెలిపించండని.. బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లేనని అన్నామలై పేర్కొన్నారు.
JP. Nadda: కాంగ్రెస్ స్కామ్‌ల పార్టీ.. బీఆర్ఎస్ ఏటీఎం పార్టీ
అబద్ధాల పునాదులపైనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నామలై పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు హామీలు అమలు చేస్తామని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. సీఎం రేవంత్‌రెడ్డి, రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రచార సమయంలో గాడిద గుడ్డునే పట్టుకుని తిరుగుతున్నారని, అబద్ధాలు చెప్పిన వారిని గాడిదపై కూర్చోబెడతామని దుయ్యబట్టారు.