ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. 98 పరుగుల తేడాతో కేకేఆర్ గెలుపొందింది. 236 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన లక్నో.. కేవలం 137 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బౌలర్లు ధాటికి లక్నో బ్యాటర్లు చేతులెత్తేయడంతో.. ఎల్ఎస్జీ ఓటమి పాలైంది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినీస్ అత్యధికంగా 36 పరుగులు చేశాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (25), కుల్ కర్ణి (9) పరుగులు చేశారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. కేకేఆర్ ముందు 236 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటింగ్ లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (32), సునీల్ నరైన్ (81) పరుగులతో మంచి శుభారంభాన్ని అందించడంతో భారీ స్కోరు చేసింది.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మిగిలేది గాడిద గుడ్డేనని విమర్శించారు. కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తమని తెలిసేసరికి గుర్తును గాడిద గుడ్డుగా మార్చారా? అని ప్రశ్నించారు. గాడిద గుడ్డు మీదున్న శ్రద్ధ 6 గ్యారంటీల అమలుపై ఎందుకు…
మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం మార్కాపురం మండలం కొండేపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. తాను రెండుసార్లు గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచెనని, ఇప్పుడు జగనన్న ఆదేశాల మేరకు మార్కాపురంలో పోటీ చేస్తున్నానని తెలిపారు. మీ అందరి ఆశీస్సులతో తనను గెలిపించాలని, మీకు సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వాలని అక్కడి ప్రజలను కోరారు. జగన్ పాలనలో అందించిన సంక్షేమ పథకాలు అందరికి అందాయన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టును.. 139 పరుగులకే కట్టడి చేసింది. చెన్నై బౌలర్లు అద్భుతంగా రాణించడంతో పంజాబ్ బ్యాటర్లు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. పంజాబ్ బ్యాటింగ్ లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఒక్కడే అత్యధికంగా (30) పరుగులు చేశాడు. ఆ తర్వాత బెయిర్ స్టో (7), రోసో డకౌట్ అయ్యాడు. శశాంక్ సింగ్ (27), సామ్ కరన్ (7), జితేష్ శర్మ…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు మరో మ్యాచ్ జరుగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ముందుగా టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి ప్లేఆఫ్స్ కు క్వాలిఫై కావాలని ఇరుజట్లు ఆశిస్తున్నాయి.
ఏలూరు జిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు అనుపమ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేయమని ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దూలం నాగేశ్వరరావు మద్ధతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతున్నానని తెలిపారు.
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బీజేపీ నిర్వహించిన సభలో హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్ నినాదాలతో ప్రజల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో ఓటు షేర్ పెరిగిందని.. 10 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థలో స్థానంలో నిలపడమే ఎన్డీఏ లక్ష్యమని అన్నారు. సీఎంగా, ప్రధాన మంత్రిగా ఒక్క అవినీతి మరక…
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. ఓ మోస్తరు స్కోరు చేసింది. పంజాబ్ ముందు ఫైటింగ్ స్కోరును ఉంచింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సిక్సర్ల దూబె మళ్లీ విఫలమయ్యాడు. ఏమీ పరుగులు చేయకుండా డకౌట్ అయ్యాడు. ధోనీ కూడా ఒక్క రన్ చేయకుండానే ఔటయ్యాడు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు ఆంధ్రా పేపర్లు ఉద్యమాన్ని కింద మీద చేశారని ఆరోపించారు. వాళ్ళు అడిగితే ఒకటే మాట చెప్పినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెళుతున్నా.. తెలంగాణ రాష్ట్రంతో తిరిగి వస్తానని చెప్పారన్నారు. తెలంగాణ…