సోమవారం ప్రధాని మోడీ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా.. ప్రధాని వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుందని విమర్శించారు. మోడీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడని.. రైల్వే జోన్ పై మోడీ అవగాహన లేకుండా మాట్లాడారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకడు తానా అంటే.. ఇంకొకడు…
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం జగన్ మోహాన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం అందించామని తెలిపారు. అవ్వా తాతలకు ఇంటి వద్దకే పింఛన్, రేషన్, పథకాలు, పౌర సేవలు తలుపుతట్టి అందిస్తున్నాని అన్నారు. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మహిళలకు, మత్స్యకారులు, నేతన్నలకు తోడుగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు.. మూలపేట పోర్టు కడుతున్నాం.. భోగాపురం ఎయిర్ పోర్ట్, ఉద్దానం కిడ్ని సమష్యకు పరిష్కారం చూపించే విధంగా రూ.700 కోట్ల త్రాగునీటి ప్రాజెక్ట్…
దేశంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో నరేంద్ర మోడీ నిలిచిపోయారన్నారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి కొండా సంగీత రెడ్డి. మంగళవారం ఉదయం వికారాబాద్ పట్టణంలోని ఓల్డ్ గంజ్ ప్రాంతంలో తన భర్త గెలుపుని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా.. కొండా సంగీత రెడ్డి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను వారికి వివరించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలోనే చేధించింది. కేవలం 3 వికెట్లు కోల్పోయి ముంబై గెలుపొందింది. ముంబై బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్.. సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో.. ఆయన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 51 బంతుల్లనే 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మొదటగా ముంబై జట్టులో 3 వికెట్లు వెంట వెంటనే కోల్పోయినప్పటికీ.. మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వైపు తిరిగింది. కానీ.. సూర్యకుమార్…
చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ప్రతి అర్హుడికి ఆరు గ్యారంటీలకు తీసుకువచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం శివరాంపల్లి, బండ్లగుడ జాగీర్, మణికొండలో ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నియోజకవర్గ ఇంఛార్జి కస్తూరి నరేందర్ తదితర నాయకులతో ఆయన ప్రచారం చేశారు.
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలో స్ధానిక నాయకులతో కలిసి గన్నవరం నియోజకవర్గం జనసేన, బీజేపీ బలపరచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అంతకుముందు ఆయనకు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీగా ఎదురేగి ఘనస్వాగతం పలికారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల…
ప్రధాని మోడీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. రెండుచోట్ల నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొ్న్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి మద్ధతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీకి వచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాగా.. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై వైసీపీ రియాక్షన్ ఇచ్చింది. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై మోడీ, చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు బాబే యూ టర్న్ అనుకుంటే ఇప్పుడు…
ప్రధాని మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈరోజు ఏపీలో పర్యటించిన ప్రధాని, ఈ నెల 8వ తేదీన విజయవాడకు రానున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. ప్రధాన రోడ్లలో సరుకు రవాణా వాహనాలు, భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు సహా అన్ని వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపులు చేయనున్నారు. మరోవైపు.. రోడ్ షోలో పాల్గొనటం కోసం వచ్చే వారికి పార్కింగ్ స్థలాలు నిర్ణయించారు విజయవాడ పోలీసులు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో.. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగానే.. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. అక్కడ ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. మరోవైపు.. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4 తేదీన ఏపీలో, ఢిల్లీలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో వికసిత ఆంధ్రప్రదేశ్ - వికసిత భారత్ సాధ్యం అన్నారు. ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని…