మార్కాపురం నియోజకవర్గ ప్రజలు ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును బ్యాలెట్ నందు “1వ” నెంబర్ పై గల ఫ్యాన్ గుర్తుకు ఓటేసి.. తనకు అవకాశం కల్పించండని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రజలను అభ్యర్థించారు. ఆదివారం మార్కాపురం మండలంలోని కొండేపల్లి, నాయుడుపల్లి, నాయుడుపల్లి ఎస్సీకాలనీ, మన్నెంవారిపల్లి, మాలపాటిపల్లి, తూర్పుపల్లి, గజ్జలకొండ, గుండాలపల్లి, నాగిరెడ్డిపల్లి, పిచ్చిగుంట్లపల్లి, పడమటిపల్లి, పడమటిపల్లి ఎస్సీపాలెం, తర్లుపాడు మండలంలోని గోరుగుంతలపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రచాం నిర్వహించారు. ఈ ప్రచారానికి ముఖ్య అతిధిగా ఏపీఐఐసి చైర్మన్ జంకే వెంకట రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. ఆయా గ్రామాల్లోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న పాలనలో చేసిన మంచిని వివరించారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.
Rahul Gandhi: రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని తొలగిస్తాం.. అవసరమైనంత ఇస్తాం..
అనంతరం అన్నా రాంబాబు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కావున ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించి.. జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్సార్ కుటుంబానికే దక్కిందన్నారు. జగనన్న పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేలా కృషి చేశారన్నారు. డీబీటీ- నాన్ డీబీటీ ద్వారా.. రూ.4.65 లక్షల కోట్లు పేదల చెంతకే చేర్చారన్నారు. జగనన్నతోనే ఆంధ్రప్రదేశ్ రాష్టం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ముందుగా ఆయా గ్రామాల్లోని పలువురు వైసీపీ నాయకులు, పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు, వైసీపీ ప్రజా ప్రతినిధులు, వైసీపీ కుటుంబ సభ్యులు, మార్కాపురం, తర్లుపాడు మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.