ఎన్నికలకు సమయం సరిగ్గా వారం రోజులు కూడా లేదు. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలు తమ నియోజకవర్గంలో ప్రచారంలో జోరు పెంచారు. కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వెళ్లి తమ పార్టీ అందించే సంక్షేమ పథకాలు, తమ పార్టీకి ఓటు వేయడం ద్వారా భవిష్యత్ లో కలిగే లాభాలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అని తేడా లేకుండా.. గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ అభ్యర్థికి ఓటేయాలని కోరుతున్నారు.
Rishi Sunak: రిషి సునాక్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం..
కృష్ణా జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తోట నరసింహంకు మద్దతుగా ఆయన తనయుడు రాంజీ ప్రచారం నిర్వహించారు. గోకవరం మండలం మల్లవరం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి తన తండ్రిని ఆశీర్వదించాలని కోరారు. గతంలో తోట నరసింహం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగ్గంపేట అభివృద్ధిలో ముందు ఉందని గుర్తు చేశారు. జగన్ మళ్ళీ సీఎం అయితేనే సంక్షేమం, అభివృద్ధి ఫలాలు పేదలకు అందుతాయని అన్నారు. గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.
China: చైనాలో మళ్లీ మహమ్మారి వ్యాప్తి చెందుతుందా..? ఆసుపత్రుల్లో ఐసీయూ పడకలను పెంచాలని సిఫార్సు