జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం (మం) దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు విజయరమణ రావు, మక్కాన్ సింగ్, ప్రేమ్ సాగర్ రావు, గండ్ర సత్యనారాయణ, అడ్డురి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలను స్వామి వారి శేష వస్త్రాలతో మంత్రి శ్రీధర్ బాబు సన్మానించారు. అనంతరం.. స్వామి వారి తీర్థ్ర ప్రసాదాలను అర్చకులు…
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు జరగాల్సిన కోల్కతా నైట్ రైడర్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. కాసేపు వర్షం ఆగినప్పటికీ.. తిరిగి మళ్లీ ప్రారంభంకావడంతో రద్దు అయింది. ఈ క్రమంలో.. ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది.
ఓట్లను బహిష్కరిస్తామనే నక్సలైట్ల బెదిరింపు నక్సలైట్ల ఆఖరి కంచుకోట అయిన సరంద మరియు కొల్హన్‌లోని దట్టమైన అడవుల్లో ఉన్న గ్రామాల్లో ఎలాంటి ప్రభావం చూపలేదు. నక్సల్ ప్రభావిత గ్రామాల్లో నిర్మించిన బూత్‌ల వద్ద ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత 20 ఏళ్లుగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన తిరిల్పోసి, రెంగ్‌దహతు, బోరోయి గ్రామాల్లో ఓటింగ్ జరగలేదు. ఈ మూడు గ్రామాల్లో తొలిసారిగా ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఉదయం నుంచే ఈ కేంద్రాల వద్ద మహిళా, పురుష ఓటర్లు పోటెత్తారు.…
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 12 నుండి 15 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందుతానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వారు ఓటర్లకు డబ్బులు చూపి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా.. ప్రజలు…
ఈ ఎన్నికల్లో అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించిన క్షేత్రస్థాయి భారత రాష్ట్ర సమితి శ్రేణులు అందరికీ, పార్టీ నాయకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎదురుదెబ్బలు ఎన్ని కొట్టావు అన్నది కాకుండా.. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా సవాళ్లు ఎదుర్కొని తిరిగి నిలబడి పోరాటం చేశామన్నదే ముఖ్యం అన్న నానుడిని నిజం చేసిన పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తిరిగి బలంగా నిలబడి కొట్లాడడం ఆషామాషి వ్యవహారం కాదని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన…
బీజేపీ కొత్త శక్తిగా తెలంగాణలో అవతరిస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. ఓటు వేసిన ప్రజలకు, అధికారులకు, రాజకీయపార్టీల కార్యకర్తలకు, మీడియాకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యం మరింత బలపడేందుకు ఉపయోగపడుతుంది.. పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. బీజేపీకి సానుకూల వాతావరణ కనిపించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కాగా.. పోలింగ్ రాష్ట్రమంతటా ప్రశాంతంగా జరగ్గా, కొన్నిచోట్ల మాత్రం చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా.. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా పరకాల మండలం నాగారంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ సెంటర్ దగ్గర బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. అఘాయిత్యాలపై తప్పుడు ప్రకటనలు చేస్తూ రాష్ట్ర మహిళల ఆత్మగౌరవంతో ఆడుకోవద్దని మండిపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు, ప్రధాని మోడీపై సీఎం మమత విరుచుకుపడ్డారు. బొంగావ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి పాలిత రాష్ట్రాల మాదిరిగా లేదని ప్రధాని మోడీ గుర్తుంచుకోవాలని అన్నారు. అంతేకాకుండా.. ఇక్కడ మహిళల ఆత్మగౌరవంతో ఆడవద్దని, మా అమ్మానాన్నల గౌరవంతో ఆడుకుని కుట్ర పన్నవద్దని…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా తనకు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌పై.. మే 17వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరుపనున్నది.
మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. బాంరగడ్ తాలుక కత్రన్ గట్ట అటవీప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు, ఒక మగ మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోంది.