అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానే నిర్దోషి అని తేలింది. సందీప్ లామిచానేపై దాఖలైన అత్యాచారం కేసులో పటాన్ హైకోర్టు తుది తీర్పును వెలువరిస్తూ.. అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత తీర్పును తోసిపుచ్చింది. కాగా.. అతను టీ20 ప్రపంచ కప్ 2024 కోసం నేపాల్ తరుఫున ఆడనున్నాడు. పటాన్ హైకోర్టు అధికార ప్రతినిధి తీర్థరాజ్ భట్టారాయ్ ప్రకారం.. సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ బెంచ్ నిర్ణయాన్ని తోసిపుచ్చింది.
పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన తండ్రి డ్రగ్స్ కు బానిసయ్యాడని హత్య చేశాడు. ఈ ఘటన టిబ్బా సుల్తాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. ముల్తాన్-వెహారి పట్టణంలో జరిగిన ఈ సంఘటన స్థానిక సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పాకిస్తాన్ పోలీసులు, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అనంతరం నిందితుడు అలీ హసన్ (15)ను అదుపులోకి తీసుకున్నారు.
అతి తక్కువ కాలంలోనే భారత ఆటోమొబైల్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. కంపెనీ ఎప్పుడు, ఏ విభాగంలో, ఏ EVని తీసుకురాగలదో తెలుసుకుందాం.
టీ20 వరల్డ్ కప్ 2024కి జట్టును ప్రకటించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రజా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. మెగా టోర్నీకి సమయం తక్కువగా ఉంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ జట్టును ఇంకా ప్రకటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. మంగళవారం బంగ్లాదేశ్ కూడా తన జట్టును ప్రకటించిందని తెలిపారు. కాగా.. పాకిస్తాన్ జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది.
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ కు అర్హత సాధించే జట్లపై స్టార్ స్పోర్ట్స్ నిపుణుల ప్యానల్ అంచనా వేసింది. అందులో కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ఆర్ఆర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్కు వెళ్తాయని ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు, మహమ్మద్ కైఫ్, టామ్ మూడీ, మాథ్యూ హెడెన్లు అభిప్రాయపడ్డారు. అయితే, 18వ తేదీన సీఎస్కేతో మ్యాచ్ లో ఆర్సీబీ గెలుపొంది ప్లేఆఫ్స్కు వెళ్తుందని క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 19 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో అత్యధికంగా నికోలస్ పూరన్ (61) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 4 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. చివర్లో అర్షద్ ఖాన్ (58) పరుగులతో చెలరేగాడు. ఒకానొక సమయంలో మ్యాచ్ మొత్తం లక్నో…
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంగళవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బుధవారం (రేపు) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఒరిస్సా రాష్ట్రంలోని బోలంగిర్ లోక్ సభ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీతో కలిసి ప్రత్యేక విమానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బొలంగిర్ లోక్ సభ స్థానానికి చేరుకోనున్నారు.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మూడు ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో సీఎం సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 34 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా అందులో 33 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కీలకంగా పనిచేసి ఎమ్మెల్సీ స్థానాన్ని…
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 65.67 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరి 76.78 శాతం, అత్యల్పంగా.. హైదరాబాద్ 48.48 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు. తెలంగాణలో 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో రాష్ట్రంలో 62.77 శాతం ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గంలో 50.34% ఓటింగ్ నమోదైంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లకు 209 లక్ష్యాన్ని ముందు ఉంచారు. కాగా.. ఢిల్లీ బ్యాటింగ్ లో అభిషేక్ పోరెల్ (58), ట్రిస్టన్ స్టబ్స్ (57*) పరుగులతో రాణించడంతో ఢిల్లీ భారీగా స్కోరు చేయగలిగింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ 33 బంతుల్లో 58 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 4…