Hemant Soren: కేజ్రీవాల్ లాగా నాకు బెయిల్ రావాలి.. సుప్రీంను ఆశ్రయించిన మాజీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా తనకు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌పై.. మే 17వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరుపనున్నది.
‘కేజ్రీవాల్ కేసులో ఉత్తర్వులు నాకూ వర్తిస్తాయి’ అంటూ హేమంత్ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్.. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో.. న్యాయస్థానం ఈడీకి నోటీ జారీ చేసింది. తన అరెస్టును సవాలు చేస్తూ హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడంతో దానిని ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
AP Elections 2024: ఏపీలో భారీగా పోలింగ్.. 5 గంటలకే 70 శాతానికి చేరువగా..
మరోవైపు తన కేసు అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు ఉందని, ఎన్నికల ప్రచారం కోసం తనకు బెయిల్ అవసరమని కపిల్ సిబల్ ధర్మాసనానికి తెలిపారు. సిబల్ వాదనపై ధర్మాసనం.. ఈ వారం చాలా పని ఉందని, చాలా కేసులు ఉన్నాయని తెలిపింది. తేదీని మార్చడం కష్టమని పేర్కొంది. తొలుత తాము ఈడీకి సమయం ఇచ్చి, వారి సమాధానం అనంతరం మే 20న వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొన్నది. అయితే.. అప్పటికి లోక్‌సభ ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న కారణంగా ఉపయోగం ఉండదని కపిల్ సిబల్ వాదించారు.
శుక్రవారం కూడా ఈ కేసును విచారించే అవకాశాలు 99 శాతం లేవని బెంచ్ పేర్కొన్నది. మే 20న ఈ కేసును చేపడుతామని తెలిపింది. దీనికి సిబల్ స్పందిస్తూ.. ఎన్నికల్లో పాల్గొనలేని పక్షంలో తన పిటిషన్ ఉపసంహరించుకుంటానని అన్నారు. మరోవైపు.. పిటిషన్ వాపస్ తీసుకోవాలనుకుంటున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. మే 17న విచారణ జరిపినప్పటికీ అదే రోజు తీర్పు వెలువరించలేమని, మే 20న ఎన్నికలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొన్నది. దీనికి సిబల్ స్పందిస్తూ.. ఆ తర్వాత కూడా ఎన్నికలు ఉన్నాయన్నారు. చివరకు ఈ కేసును మే 17వ తేదీన జాబితా చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!