మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. బాంరగడ్ తాలుక కత్రన్ గట్ట అటవీప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు, ఒక మగ మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోంది. మృతుల్లో పెరిమిలి దళం కమాండర్ వాసు ఉన్నట్లు సమాచారం. కాల్పులు జరిపిన అనంతరం.. భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి ఒక ఏకే-47 రైఫిల్, ఒక కార్బైన్ గన్ మరియు ఒక INSAS రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నాయి. నక్సలైట్ల మృతదేహాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Chetan Chandra: ఘోరంగా నటుడిపై దాడి.. రక్తం దెబ్బలతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి..
ఈ అటవీ ప్రాంతంలో కొందరు నక్సలైట్లు విడిది చేసినట్లు తమకు సమాచారం అందిందని పోలీసు అధికారి తెలిపారు. అటువంటి పరిస్థితిలో.. సైనికుల బృందం శోధన ఆపరేషన్ కోసం అడవికి చేరుకుందని.. అడిషనల్ ఎస్పీ ఆప్స్ యతీష్ దేశ్‌ముఖ్ నేతృత్వంలో సీ60కి చెందిన రెండు యూనిట్లను వెంటనే రంగంలోకి దింపారు. ఆ ప్రాంతంలో బృందాలు శోధన కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు, నక్సలైట్లు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీనికి తమ C60 బృందాలు తీవ్రంగా ప్రతిస్పందించాయని తెలిపారు. ఆ ప్రాంతంలో తదుపరి సోదాలు, యాంటీ నక్సల్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కూడా పలువురు నక్సలైట్లను భద్రతా బలగాలు హతమార్చాయి. జమ్మూ కాశ్మీర్‌లో కూడా ఉగ్రవాదులు ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు. అయితే భద్రతా దళాలు వారి ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టారు.
Read Also: Hyderabad: పాతబస్తీ మీర్ చౌక్ వద్ద ఉద్రిక్తత