Pawan Kalyan: 21 ఎమ్మెల్యే, 2 ఎంపీలు ఉన్న పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీతో సహా జాతీయ స్థాయిలో మనకి గౌరవం ఇస్తున్నారంటే.. జనసేన అంత బలమైనది అని అర్థం అన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జనసేన పదవి – బాధ్యత పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ దృక్పథంతో నేను పార్టీ పెట్టలేదు.. జాతీయ దృక్పథంతో ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనుకుని పెట్టాను అన్నారు.. జనసేన ఐడియాలజీ గడిచే కొద్ది విస్తృతంగా కలుపుకునే ఐడియాలజీ తప్పా వేరు చేసే ఐడియాలజీ కాదన్నారు.. దానికి ఉదాహరణ గానే ఇవాళ మీరంతా ఇక్కడ ఉన్నారని.. అంటే ఈ భావజాలానికి ఎంత బలం ఉండి ఉండాలి? అని ప్రశ్నించారు.. సలసల రక్తం మరిగే యువతకి ఇది ఒక వేదిక కావాలి అని పెట్టాను అని గుర్తుచేసుకున్నారు..
Read Also: Dhurandhar : పాకిస్థాన్’లో ధురంధర్ పైరసీ రికార్డ్
ఇక, రానున్న మూడేళ్లు చాలా చేయొచ్చు.. గ్రామ స్థాయిలో సమస్య రాష్ట్ర స్థాయికి రాకుండా వ్యవస్థలు పని చేయాలని సూచించారు పవన్ కల్యాణ్.. అక్కడ వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే మా వరకూ రావు కదా.. మనం తగ్గాలని.. ఇంకొకరిని పెంచాలని అస్తమాను పదేళ్లు, పదిహేను ఏళ్లు అనడం లేదు.. గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టాలంటే సుస్థిర పాలన ఉండాలన్నారు.. చాలా ఏళ్లుగా పాడైపోయిన వ్యవస్థను బాగుచేసే పనిలో ఉన్నాం.. వైసీపీలో ఇమడలేక కొందరు మాజీ ఎమ్మెల్యేలు మన పార్టీలోకి వచ్చారు.. ఐదేళ్లు పనిచేసిన సీఎం పేర్లు పథకాలు పెట్టేస్తున్నారు.. కానీ, అసలైన త్యాగం చేసిన అమరజీవి లాంటి వాళ్ల పేర్లు పెడుతున్నాం.. పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ లాంటి మహనీయులకు కులాలను ఆపాదించేస్తున్నారు.. ఇది చాలా తప్పు అని సూచించారు.. పోలవరం ప్రాజెక్టుకు పొట్టిశ్రీరాములు పేరు పెడితే అలాంటి మహనీయుడికి సరైన నివాళి అవుతుందన్న ఆయన.. ఇది నా ప్రతిపాదన.. నా కోరిక.. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..