బీజేపీ కొత్త శక్తిగా తెలంగాణలో అవతరిస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. ఓటు వేసిన ప్రజలకు, అధికారులకు, రాజకీయపార్టీల కార్యకర్తలకు, మీడియాకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యం మరింత బలపడేందుకు ఉపయోగపడుతుంది.. పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. బీజేపీకి సానుకూల వాతావరణ కనిపించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
CEO Vikas Raj: భారీ బందోబస్తుతో స్ట్రాంగ్‌రూమ్స్‌లో ఈవీఎంలను భద్రపరుస్తాం..
పార్టీలకు అతీతంగా గ్రామాల్లో బీజేపీకి ఓటు వేశారని.. మహిళలు, యువత బీజేపీని ఆదరించారని కిషన్ రెడ్డి తెలిపారు. అర్బన్ ఏరియాలో ఓటింగ్ తక్కువ అయినా.. బీజేపీకి పడ్డాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టినా బీజేపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని తెలిపారు. ప్రత్యర్థులం తప్ప శత్రువులం కాదన్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి డబల్ డిజిట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు గోబెల్ ప్రచారం చేసినా.. ప్రజలు బీజేపీని ఆదరించారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో బండి సంజయ్ నాయకత్వంలో యాత్రలు నిర్వహించామని కిషన్ రెడ్డి తెలిపారు. సంకల్ప యాత్రలు, ప్రధాని పర్యటనలు తెలంగాణలో గెలుపుకు ప్లస్ అవుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు రెస్ట్ తీసుకోకుండా పనిచేశారు.. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అని అన్నారు.
Warangal: వరంగల్ జిల్లా నాగారంలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ
రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. వాళ్ల నాయకుడికే దిక్కులేదు.. అక్కడ ఇక్కడ ఉరుకుతున్నారని విమర్శించారు. స్థాయిని తెలుసుకొని సవాళ్లు విసిరితే బాగుంటుందని అన్నారు. మాటలు తాము కూడా మాట్లాడగలమన్నారు. దేవుడిని నమ్మని వాళ్ళు దేవుని మీద ఓట్లు పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. తమ ఎజెండాలో లేని విషయం కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేశారని అన్నారు. అబద్దాలు రాజ్యం ఏలుతున్నాయని.. ఎలక్షన్ కమిషన్ పంచిన స్లిప్స్ కూడా పనికిరాలేదని తెలిపారు. కావాలని ఒక వర్గం ఓట్లు తొలగించారని ఆరోపించారు. చాలా చోట్ల బీఆర్ఎస్ ఏజెంట్లు లేరని.. ఆ పార్టీ ఏజెన్సీల ద్వారా ఏజెంట్లను పెట్టిందని అన్నారు. మరోవైపు.. మజ్లిస్ కాంగ్రెస్ కు సహకరించిందని కిషన్ రెడ్డి తెలిపారు.