రైలు ప్రయాణం చేసేటప్పుడు తమతో పాటు తమ లగేజీలను బ్యాగ్ లలో తీసుకువెళతారు. అయితే.. అందులో ఏముంటుందన్న విషయం పక్కన కూర్చే వారికి తెలియదు. కానీ.. స్మగ్లర్లు రైలు ప్రయాణం ద్వారానే.. కోట్లాది విలువ చేసే డ్రగ్స్ ను రాష్ట్రాలు దాటిస్తున్నారు. సమాచారం అందితే దొరికేవి కొన్నైతే.. దొరకనివి చాలా ఉన్నాయి. తరుచూ మనం చూస్తూనే ఉంటాం.. రైళ్లలో డ్రగ్స్ తరలిస్తున్నారని.. పట్టుబడ్డారన్న వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవుతుందని మాట్లాడేటోడికి.. మెదడు తక్కువ ఉన్నట్టు ఉందని దుయ్యబట్టారు. అది ఎప్పుడు చేస్తారో తెలియదు.. కేంద్రపాలిత ప్రాంతం అనేదే ఉండదన్నారు. కేటీఆర్ మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. సెకండ్ క్యాపిటల్ చేయండి అని కేటీఆర్ డిమాండ్ చేశాడు కదా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపటి నుండి పరిపాలన మీద దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ పై ఫోకస్, విద్యాశాఖ మీద ఫోకస్, అన్ని హస్టల్స్ కి సన్న బియ్యం.. బీఆర్ఎస్ ఇచ్చిన సన్న బియ్యం కాదు.. నిజమైన సన్నబియ్యం ఇస్తామని అన్నారు. త్వరలో బ్యాంకర్ల సమావేశం ఉంటుందన్నారు. రుణమాఫీ పై చర్యలు, రైతుల రుణాలు ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతుల రుణాలు మాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని.. దాని ద్వారా…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనున్నది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన లక్నో ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ విజయం ఇరు జట్లకు కీలకమైనది. ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే రెండు టీమ్ లు తప్పక గెలవాల్సిన పరిస్థితి.
పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంటు సీటు కాంగ్రెస్ గెల్చుకుంటుందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 11 ఎంపీ సీట్లను గెలుస్తుందని తెలిపారు. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీంమ్ అని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని విమర్శించారు. కేసీఆర్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని అన్నారు. నిన్న తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు పువ్వు గుర్తుకు ఓటెయ్యమని చెప్పడం నిదర్శనం అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జేయింట్స్ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. 165 పరుగులు చేసింది. ఈ క్రమంలో.. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఒక్క వికెట్ కోల్పోకుండా విజయం సాధించింది. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ పై విరుచుకుపడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా భయపడకుండా.. వారు చేసే పని వారు చేస్తూనే ఉన్నారు కామాంధులు. తాజాగా.. కేరళలోని కన్నూర్‌లో ఓ మహిళపై లైంగిక వేధింపుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాగా.. ఈ కేసులో పోలీసులు చర్యలు తీసుకుని కేరళ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో.. నిందితుడు ఇఫ్తికార్ అహ్మద్‌ను విస్మయ ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిని…
గుజరాత్లో తీవ్ర విషాదం నెలకొంది. పోయిచా గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చిన ఆ ఏడుగురిని మృత్యువు వెంటాడింది. మంగళవారం నర్మదా నదిలో ఆరుగురు బాలురుతో పాటు ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కాగా.. అది చూసిన స్థానికులు భయంతో అరుపులు, కేకలు వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్మదా నదిలో స్నానం చేసేందుకని అందులోకి దిగారని, అయితే లోతు ఎక్కువగా ఉండటంతో అందులో మునిగిపోయినట్లు చెబుతున్నారు. కాగా.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
కేరళలోని కోజికోడ్‌లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ రోగిని.. అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మంటల్లో కాలిపోయింది. ప్రమాదవశాత్తు అంబులెన్స్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో.. అంబులెన్స్‌లో ఉన్న మహిళా రోగి సజీవ దహనమైంది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. కాగా.. రేపు తెలంగాణ భవన్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గులాబీ బాస్ కేసీఆర్ హాజరు కానున్నారు. తమకు సిట్టింగ్ స్థానంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని దక్కించుకోవాలని బీఆర్ఎస్ యోచనలో ఉంది. ఈ క్రమంలోనే.. కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.