ఏపీలో రేపు జరగబోయే పోలింగ్ పై భారీ వర్ష సూచన ఉంటుందని ఆందోళన చెందుతున్న అధికారులకు, ఓటర్లకు విశాఖ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పోలింగ్ నిర్వహణకు వరుణుడి ముప్పు తక్కువే అని సూచించింది. రేపు రాష్ట్రంలో వర్ష ప్రభావం పెద్దగా ఉండదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్ష సూచన ఉంటుందని.. భారీ వర్ష సూచన లేదని పేర్కొన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 80 శాతం పోలింగ్ లక్ష్యంగా పెట్టుకోవడంతో ప్రతి ఒక్క ఓటరుకు అవకాశం కల్పించాలని ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికే పోలింగ్ బూత్లకు పోలింగ్ మెటీరియల్ తరలింపు పూర్తయింది. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భద్రతా బలగాలపై జరిగిన రెండు వేర్వేరు ఉగ్రవాదుల దాడుల్లో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ మేరకు ఆదివారం అధికారులు సమాచారం అందించారు. మొదటి దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించారని, ఇద్దరు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలోని హసన్ ఖేల్ ప్రాంతంలో శనివారం బాంబు నిర్వీర్య యూనిట్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగిందని పాకిస్థాన్ భద్రతా అధికారులు తెలిపారు. పేలుడు జరిగిన అనంతరం.. ఉగ్రవాదులు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు డబల్ డెక్రర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. చెన్నైతో జరుగుతున్న మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ తక్కువ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది రాజస్థాన్. పరుగులు సాధించడంలో రాజస్థాన్ బ్యాటర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ.. చెన్నై బౌలర్లు రన్స్ చేయకుండా కట్టడి చేశారు. రాజస్థాన్ బ్యాటింగ్ లో రియాన్ పరాగ్ (47*) అత్యధికంగా పరుగులు చేసి జట్టుకు కీలక పరుగులు అందించాడు.
ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో.. మచిలీపట్నం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతే.. జిల్లాలో రేపు జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధం అయిందని తెలిపారు. మరోవైపు.. పోలింగ్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. జిల్లాలో 1768 కేంద్రాల్లో 364 పోలింగ్…
బ్రిటన్‌కు చెందిన 18 నెలల బాలిక ఒపాల్ శాండీ చరిత్ర సృష్టించింది. జీన్ థెరపీ ద్వారా బాలిక చెవిటితనాన్ని శాశ్వతంగా నయం చేశారు. ఈ థెరపీ ద్వారా మళ్లీ వినగలిగే ప్రపంచంలోనే మొదటి బిడ్డ ఆమె. ఈ చారిత్రాత్మక విజయంతో ఇకపై చెవిటి వ్యాధికి సులభంగా చికిత్స అందుతుందని వైద్యులు తెలిపారు. ఈ థెరపీ ఒక మైలురాయిగా నిరూపించబడింది.
సీఎం జగన్ ఈరోజు సాయంత్రం పులివెందుల వెళ్ళనున్నారు. దాదాపు రెండు నెలలపాటు ప్రచారంలో హోరెత్తించిన ముఖ్యమంత్రి.. నిన్న పిఠాపురంలో జరిగిన సభతో ప్రచారానికి తెర వేశారు. కాగా.. ఈ ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉన్నారు సీఎం జగన్.. సాయంత్రం తన సతీమణి భారతితో కలిసి పులివెందులకు వెళ్తున్నారు. రేపు తాను పోటీ చేస్తున్న సొంత నియోజకవర్గంలోని బాకరపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఏపీ సీఈఓ ఎంకే మీనా మాట్లాడుతూ.. పోల్ వయొలెన్స్ జరగకూడదని జిల్లా ఎస్పీలకు ఈసీ వార్నింగ్ ఇచ్చిందన్నారు. జీరో వయొలెన్స్, జీరో రీ-పోలింగ్ లక్ష్యంగా ఎన్నికల నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. 64 శాతం మేర పోలింగ్ స్టేషన్లలో వెబ్ కామ్ పెట్టామని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్ల లోపల.. బయట…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. వర్షం కారణంగా.. 16 ఓవర్లకు కుదించడంతో.. 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ముంబై ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.