New Income Tax Rules: ఇకపై డిజిటల్ ఖాతాలను వదలబోనంటున్న ఐటీ శాఖ.. అతి త్వరలో సరికొత్త రూల్స్ అమల్లోకి..!
- డిజిటల్ ఖాతాల తనిఖీకి ఐటీ శాఖకు అధికారం కల్పించనున్న కేంద్ర ప్రభుత్వం
- ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలు
- పన్ను ఎగవేత, దాచిన ఆదాయం, ప్రకటించని ఆస్తులపై అనుమానం ఉన్నప్పుడే తనిఖీలు
- ఇప్పటివరకు భౌతిక ఆధారాలకే పరిమితమైన ఐటీ సెర్చ్ పరిధి
- ఇకపై డిజిటల్ ప్రపంచం కూడా ఐటీ తనిఖీల్లో భాగం
- సోషల్ మీడియా ఖాతాలు, వ్యక్తిగత ఈమెయిల్స్ తనిఖీ చేసే అధికారం
- ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ రికార్డులు, క్రిప్టో లావాదేవీల పరిశీలన
- క్లౌడ్ సర్వర్లు, డిజిటల్ స్టోరేజ్ డేటా కూడా తనిఖీ పరిధిలోకి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Income Tax Rules: డిజిటల్ యుగంలో పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపు పన్ను చట్టం కింద, ఆదాయపు పన్ను శాఖకు (Income Tax Department) సోషల్ మీడియా ఖాతాలు, వ్యక్తిగత ఈమెయిల్స్, ఇతర డిజిటల్ స్పేస్‌లను తనిఖీ చేసే అధికారం కల్పించనున్నారు. పన్ను ఎగవేత, దాచిన ఆదాయం లేదా ప్రకటించని ఆస్తులపై అనుమానం ఉన్నప్పుడు మాత్రమే ఈ అధికారాలు వినియోగించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
Pawan Kalyan: పదవి చిన్నదా..పెద్దదా కాదు బాధ్యతే గొప్పది.. జనసేన నేతలతో డిప్యూటీ సీఎం
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇప్పటివరకు ఐటీ అధికారులు ప్రధానంగా భౌతిక ఆధారాలైన పత్రాలు, ఆస్తులు, లాకర్లు, బ్యాంకు ఖాతాల తనిఖీలకే పరిమితమయ్యేవారు. అయితే కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, డిజిటల్ ప్రపంచం కూడా ఐటీ సెర్చ్ పరిధిలోకి వస్తుంది. సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్ ఇన్‌బాక్స్‌లు, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ రికార్డులు, క్రిప్టో లావాదేవీలు, క్లౌడ్ సర్వర్లు వంటి వాటిని పరిశీలించే అధికారం ఐటీ అధికారులకు లభిస్తుంది.
ప్రభుత్వం చెబుతున్న కారణం స్పష్టంగా ఉంది. నేటి ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం డిజిటల్ లావాదేవీలపై ఆధారపడుతోంది. ఆదాయం, పెట్టుబడులు, వ్యాపార లావాదేవీలు, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయాలు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేతదారులను గుర్తించాలంటే డిజిటల్ ఆధారాలను పరిశీలించడం తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అధికారాలు అందరికీ యథేచ్ఛగా వర్తించవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పన్ను ఎగవేతపై తగిన ఆధారాలతో కూడిన అనుమానం ఉన్నప్పుడు మాత్రమే డిజిటల్ ఖాతాల తనిఖీ జరుగుతుంది. ఇది సమూహ నిఘా (Mass Surveillance) కాదని, కేవలం లక్ష్యిత విచారణల కోసమేనని నిపుణులు చెబుతున్నారు.
Delhi High Court: పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ!
మరోవైపు సంపన్నులపై వారసత్వ పన్నుల అంశంపై కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై గతంలో బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం పన్ను ఎగవేత పేరుతో ప్రజల వ్యక్తిగత గోప్యతలోకి చొరబడే చర్యలకు సిద్ధమవుతుందనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా, ఈమెయిల్‌ల పర్యవేక్షణ గోప్యతకు ముప్పు కలిగిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక మన దేశ జనాభా సుమారు 140 కోట్లు కాగా, 2024 నాటికి 8.62 కోట్ల మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వీరిలో మహిళల వాటా సుమారు 15 శాతం. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు కార్పొరేట్ పన్నులను మించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి రూ.24 లక్షల కోట్లకు పైగా ఆదాయపు పన్ను ద్వారా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. కోటి రూపాయలకుపైగా ఆదాయం ఉన్నవారు 2.16 లక్షల మందికి పైగా ఉన్నారు.
ఆదాయపు పన్ను చట్టం 2025లో మొత్తం 23 అధ్యాయాలు, 536 సెక్షన్లు మాత్రమే ఉండేలా సరళీకరణ చేశారు. అర్థంకాని నిబంధనలను తొలగించి, ఐటీ అధికారులకు మరింత ఎక్కువ అధికారాలు ఇచ్చారు. పాన్–బ్యాంకు ఖాతా లింకింగ్‌తో ఇప్పటికే లావాదేవీలపై పూర్తి సమాచారం అందుబాటులో ఉంది. దీనికి తోడు, ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే డిజిటల్ ఖాతాల తనిఖీ ఐటీ శాఖకు మరింత బలమైన ఆయుధంగా మారనుంది.
తాజావార్తలు
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!