జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో.. వెంటనే అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Rohit Sharma: సూపర్ 8 మ్యాచ్లపై టీమిండియా కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..
పూంచ్ ప్రాంతంలో ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపించామని.. ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని అధికారులు చెబుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) బృందంపై కాల్పులు జరిపినట్లు సోర్సెస్ చెబుతున్నాయి. అనంతరం ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. జూన్ 9 తర్వాత జమ్మూ ప్రాంతంలో ఇది ఆరో ఉగ్రవాద ఘటన. జూన్ 9న.. ఉగ్రవాదులు యాత్రికుల బస్సుపై దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది యాత్రికులు మరణించారు. 41 మంది గాయపడ్డారు.
Nag Ashwin: కల్కి 2898 ఏడీ కథ లీక్ చేసిన నాగ్ అశ్విన్
ఇండియా టుడే, న్యూఢిల్లీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ (ICM) సంకలనం చేసిన డేటా ప్రకారం.. జనవరి 2023 నుండి జమ్మూ ప్రాంతంలో 29 ఉగ్రవాద సంఘటనలలో 42 మంది పౌరులు, భద్రతా దళ సిబ్బంది మరణించారు. ఇది జనవరి 2023 నుండి కాశ్మీర్ డివిజన్‌లో సంభవించిన మరణాల సంఖ్య కంటే దాదాపు రెట్టింపు. 2024 జూన్ 13 వరకు కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్, శ్రీనగర్, బారాముల్లా, కుల్గాం, పుల్వామా మరియు షోపియాన్ జిల్లాల్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 24 మంది పౌరులు, భద్రతా సిబ్బంది మరణించినట్లు ICM యొక్క దక్షిణాసియా ఉగ్రవాద పోర్టల్ చూపిస్తుంది.