మూడోసారి దేశంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా.. వారణాసిలో ఏర్పాటు చేసిన రైతుల సదస్సులో 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను విడుదల చేశారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి రూ.20,000 కోట్లను విడుదల చేశారు. ఈ విడతలో 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు క్రిడిట్ అవుతాయి.
Viral Video: అబ్బా ఏం ఐడియా బాసు.. ఇలా చేస్తే నెలల తరబడి కరివేపాకు ఫ్రెష్ గా..
ఈ సందర్భంగా.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. పీఎం-కిసాన్ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలకు ఇప్పటికే రూ.3 లక్షల కోట్లకు పైగా నగదు బదిలీ చేసినట్లు తెలిపారు. “ఈరోజు, ప్రధాని మోడీ ఒకే క్లిక్‌తో దాదాపు 9.26 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 20,000 కోట్లను బదిలీ చేశారు. ఇప్పటివరకు దాదాపు రూ. 3.24 లక్షల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు” ఆయన తెలిపారు.
YS Jagan Pulivendula Tour: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన రద్దు..కారణమేంటంటే?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2019 ఫిబ్రవరి 1న ప్రారంభించారు. దీని కింద ఇప్పటి వరకు 16 విడతల్లో రైతుల ఖాతాలకు నగదు బదిలీ అయ్యాయి. ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా రూ.6000 అందజేస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలకు పంపుతారు. పీఎం కిసాన్ యోజన ప్రయోజనాలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. కృషి సఖిగా శిక్షణ పొందిన 30,000 పైగా స్వయం సహాయక సంఘాలకు పారా ఎక్స్‌టెన్షన్ వర్కర్లుగా పని చేసేందుకు సర్టిఫికెట్లను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేశారు. తద్వారా వారు పారా-ఎక్స్‌టెన్షన్ వర్కర్లుగా పని చేయవచ్చు.. వ్యవసాయంలో తోటి రైతులకు సహాయం చేయవచ్చు.