బీసీసీఐ (BCCI) టీమిండియా హోమ్ సీజన్ షెడ్యూల్ ప్రకటించింది. 2024-25 దేశవాళీ సీజన్లో.. భారత క్రికెట్ జట్టు 3 జట్లతో 5 సిరీస్లు ఆడనుంది. అందులో రెండు టెస్ట్ సిరీస్లు, రెండు టీ20 సిరీస్లు, ఒక వన్డే సిరీస్ ఉన్నాయి. ఈ క్రమంలో.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు భారత్ లో పర్యటించనున్నాయి. ఇండియా స్వదేశ షెడ్యూల్ సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమవుతుంది. బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్తో పాటు మూడు టీ20ల సిరీస్ భారత్ ఆడనుంది. ఆ తర్వాత.. అక్టోబర్, నవంబర్ లో…
రైలు ప్రయాణికులకు శుభవార్త అందించింది. ఇప్పటి వరకు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో వందే భారత్ రైలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా.. ఈ రైలును కొత్త రూట్లలో నడపడానికి ఇండియన్ రైల్వే సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో.. ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతారు. కాగా.. బెంగళూరు-మధురై రూట్లో వందే భారత్ రైలు ఈరోజు నుంచి ప్రారంభమైంది.
టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్-8 మ్యాచ్లు ఈరోజు ప్రారంభమయ్యాయి. వెస్టిండీస్-అమెరికా మ్యాచ్ తో షురూ అయ్యాయి. సూపర్-8లోని గ్రూప్ 2లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరిగాయి. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా-అమెరికా జట్లు తలపడగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్, ఆతిథ్య వెస్టిండీస్ తలపడ్డాయి. కాగా.. తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా గెలువగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో.. ప్రస్తుతం రెండు జట్లు చెరో 2 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉన్నాయి.
టీమిండియా మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ ఆత్మహత్య చేసుకున్నాడు. బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి దూకి సూసైడ్ కు పాల్పడ్డాడు. డేవిడ్ జాన్సన్ భారత్ తరుఫున రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అతను 1996లో ఇండియా తరుఫున అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరంలో తన రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జాన్సన్ కు అవకాశం రాలేదు. కాగా.. డేవిడ్ జాన్సన్ మృతి పట్ల గౌతం గంభీర్, అనిల్ కుంబ్లేతో సహా పలువురు టీమిండియా మాజీ ఆటగాళ్లు నివాళులర్పించారు.
సోమవారం పశ్చిమ బెంగాల్ లోని న్యూజల్ పైగురి స్టేషన్ కు సమీపంలో కాంచన్ జంగా ఎక్స్ ప్రెస్ ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో.. 15 మంది మృతి చెందగా, 60 మందికి గాయాలయ్యాయి. అయితే.. ఈ ప్రమాదం జరిగిన స్థలానికి జనాలు చూసేందుకు భారీగా వెళ్తున్నారు. అయితే.. వారు అక్కడ సెల్ఫీలు దిగుతూ, రీల్స్ చేస్తున్న క్రమంలో షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. ట్రాక్ పై చాలా మృతదేహాలు పడి ఉన్నాయని వారు చెబుతున్నారు.
నేడు ఇండియా-అప్ఘనిస్తాన్ మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో అందరి చూపు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపైనే ఉంటుంది. ఇప్పటివరకు బ్యాట్స్మెన్కు పిచ్లు అనుకూలించని అన్ని లీగ్ దశ మ్యాచ్లను భారత్ అమెరికాలో ఆడింది. ఈ క్రమంలో.. సూపర్-8 మ్యాచ్ లు న్యూయార్క్ పిచ్ లపై జరుగనున్నాయి. దీంతో.. కోహ్లీ పరుగులు సాధిస్తాడని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో.. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కోహ్లీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సూపర్-8లో విరాట్ కోహ్లీ నిజ రూపాన్ని…
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో నేడు టీమిండియా-అఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇండియా-అప్ఘనిస్తాన్ తలపడిన టీ20 మ్యాచ్లలో టీమిండియా ఓడిపోలేదు. రెండు జట్ల మధ్య మొత్తం 8 మ్యాచ్లు జరిగాయి. అందులో టీమిండియా 6 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం రాలేదు. ఒక మ్యాచ్ ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ మ్యాచ్లో టీమిండియా గెలిచింది. దీంతో.. అప్ఘనిస్తాన్తో ఆడిన మొత్తం 8 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో టీమిండియా…
16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు 23 ఏళ్ల యువకుడికి కర్ణాటక హైకోర్టు 15 రోజుల బెయిల్ మంజూరు చేసింది. అసలు విషయానికొస్తే.. బాధిత మహిళ ఓ పాపకు జన్మనిచ్చింది. బాధితురాలికి ఇటీవలే 18 ఏళ్లు కూడా నిండాయి. ఈ క్రమంలో.. ఇరువర్గాల కుటుంబాలు వారికి పెళ్లి చేసేందుకు సానుకూలంగా ఉన్నాయి. మరోవైపు.. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి బిడ్డకు జీవనాధారమైన తండ్రి అని డీఎన్ఏ పరీక్షల్లో నిర్ధారించారు.
నిండు నూరేళ్లు బతకాల్సిన బాలిక 13 ఏళ్లకే కనుమరుగైంది. ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ.. కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం రోజున 14వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ కు పాల్పడింది. కాగా.. బాలిక 7వ తరగతి చదువుతుంది. అయితే ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు అని బయటికొచ్చి.. స్కూల్ బస్సు రాకపోవడంతో మళ్లీ ఇంట్లోకి వెళ్లింది.
సిక్కింలో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలో చిక్కుకుపోయిన 500 మందికి పైగా పర్యాటకులను రక్షించారు. భారీ వర్షాల మధ్య బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) వారిన సేఫ్ చేసింది. మంగన్ నుండి లాచుంగ్ మార్గంలో పెద్ద ఎత్తున వరదలు రావడంతో.. 15,000 మంది పర్యాటకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నారు. మరోవైపు.. భారీ వర్షాలు, వరదల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. అంతేకాకుండా.. రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో.. ఉత్తర సిక్కింలో…