West Bebgal: ‘‘దుర్గా మాత’’ పాట పాడినందుకు, సింగర్‌పై తృణమూల్ నేత దాడి..
- సింగర్‌పై టీఎంసీ నేత దాడి..
- దుర్గామాత పాట పాడినందుకు వేధింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bebgal: పశ్చిమ బెంగాల్‌లో ఒక సింగర్‌పై సీఎం మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్త దాడికి యత్నించాడు. తూర్పు మిడ్నాపూర్‌లో ఒక పాఠశాలలో లైవ్ ప్రదర్శన ఇస్తున్న సమయంలో ‘‘సెక్యులర్’’ సాంగ్స్ పాడనందుకు టీఎంసీ స్థానిక నాయకుడు తనను వేధించాడని, శారీరకంగా దాడి చేస్తానని బెదిరించాడని ప్రముఖ బెంగాల్ సింగర్ లగ్నిజిత చక్రవర్తి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం భగవాన్‌పూర్‌లోని ఒక స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.
Read Also: PM Modi: ‘‘అస్సాంను పాక్‌కు అప్పగించాలని కాంగ్రెస్ కుట్ర’’.. మోడీ వ్యాఖ్యలపై హస్తం పార్టీ ఫైర్..
Also Read
- Sudivya Kumar Sonu: ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత.. జేఎంఎం తీవ్ర దిగ్భ్రాంతి
- PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
- PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
- Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
పోలీసుకు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో చక్రవర్తి మెహబూబ్ మాలిక్ అనే వ్యక్తి వేదికపైకి ఎక్కి అందరూ చూస్తుండగానే తనపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపించారు. సింగర్ ‘‘జాగో మా’’ అంటూ దుర్గామాత పాట పాడిన తర్వాత ఆమెను అడ్డుకోవాలని ప్రయత్నించాడు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆమె కోరింది. సెక్యులర్ సాంగ్స్ పాడనందుకే సింగర్‌ను లక్ష్యంగా చేసుకున్నాడని బీజేపీ ఆరోపించడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ నేత శంకుదేబ్ పాండా ఆరోపించారు. కేసు నమోదు చేయడానికి బదులుగా ‘‘సారీ’’ చెప్పించే ప్రయత్నం చేశారని అన్నారు. 48 గంట్లో మాలిక్‌ను అరెస్ట్ చేయకుంటే నిరసన చేపడుతామని బీజేపీ హెచ్చరించింది.
తాజావార్తలు
-
Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, పండగే ఇవాళ!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
-
US – Iran Tensions: మళ్లీ భగ్గుమన్న అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లపై అగ్రరాజ్యం దాడి!
-
Sudivya Kumar Sonu: ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత.. జేఎంఎం తీవ్ర దిగ్భ్రాంతి
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!