టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో ఆఫ్ఘానిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్లో టీమిండియా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 10 మంది ఆఫ్ఘాన్ బ్యాటర్లను క్యాచ్ రూపంలోనే ఔట్ చేశారు. షార్ట్ ఫార్మాట్ హిస్టరీలో భారత్ ఇలా చేయడం ఇదే మొదటిసారి. అందులో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా చెరో 3 క్యాచ్ లు అందుకున్నారు. రోహిత్ శర్మ 2, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో క్యాచ్ పట్టుకున్నారు.
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చాలాసార్లు ప్రయాణీకుల ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది. ఆ పరిస్థితిలో వారికి ఏమి చేయాలో అర్థం కాదు. రైలులో ప్రయాణించేటప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే.. మీకు అత్యవసర పరిస్థితుల్లో సహాయపడే ఓ నెంబర్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రైలు వెళ్తున్నప్పుడు అనారోగ్యంగా అనిపిస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరు 139 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా తక్షణ సహాయం పొందవచ్చు.
సన్నగా ఉన్నారని బాధపడుతున్నారా.. ఎలాంటి ఆహారం తీసుకున్న బరువు పెరగడం లేదా.. అయితే.. ఈ యోగాసనాలతో బరువు పెరగవచ్చు. బరువు తగ్గడానికే కాదు.. పెరగడానికి కూడా యోగా ఉపయోగపడుతుంది. ఈ యోగాసనాల సహాయంతో మీరు మీ శరీర ఆకృతిని మార్చుకోవచ్చు. మీ దినచర్యలో ఈ యోగా ఆసనాలను చేయడం ద్వారా మీరు బరువు పెరగవచ్చు. ఇంతకీ ఆ యోగాసనాలు
అమ్మాయిలు అందంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం చర్మ సంరక్షణతో పాటు, చర్మాన్ని పర్ఫెక్ట్ గా మార్చడానికి స్తంభింపచేసిన వెంట్రుకలు, జుట్టును కూడా తొలగిస్తారు. వెంట్రుకలను తొలగించడానికి వాక్సింగ్ వంటి పద్ధతులు ఉన్నాయి. కానీ చాలా మంది అమ్మాయిలు ఇంట్లో షేవింగ్ చేయడం సులభమని భావిస్తారు. ఆ కారణంగా కొన్నిసార్లు చర్మంపై మొటిమలు కనిపిస్తాయి..లేదంటే వెంట్రుకలు మరింత చిక్కగా అవ్వడం ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో.. ముఖాన్ని షేవింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి. తద్వారా చర్మంలో ఎలాంటి సమస్యలు రావు.
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. ఆప్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ ముందు 182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముఖ్యంగా.. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్.. ఇంత స్కోరు చేయగలిగింది. 28 బంతుల్లో 53 పరుగులతో చేలరేగాడు. ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా (32) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత విరాట్…
యూపీలోని సంత్ కబీర్ నగర్ లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం ఆరోపణలపై జైలు నుంచి వచ్చిన ఓ యువకుడు.. తనపై సామూహిక అత్యాచారం చేశాడని కేసు నమోదు చేయాలంటూ ఓ యువతి గురువారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యకు యత్నించింది. తన వెంట తీసుకొచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకుంది. ఈ క్రమంలో మహిళా పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. యువకుడిపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో యువతి శాంతించింది.
అత్త, కోడలు మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే.. పాము, ముంగిసకు మధ్య ఉన్న వైరం అంతా ఉంటుంది. కోడలు చేసే ప్రతి పనిలో అత్తమామలు తప్పు కనిపెట్టి కించపరిచే చేస్తుంటారు. అలాంటప్పుడు.. కోడలు వాళ్లు ఉన్న ఇంట్లో ఉండటం కష్టంగా ఉంటుంది. మీకు కూడా మీ సంబంధంలో అలాంటి అత్త ఉంటే.. ఇంట్లో నుంచి వెళ్లే బదులు ఈ తెలివైన మార్గాల్లో వ్యవహారించండి.. తద్వాత జీవితాన్ని కొంత ప్రశాంతంగా జీవించవచ్చు. ఇంతకీ ఏంటో తెలుసుకుందాం.
ఒకప్పుడు నగరాల్లో మాత్రమే ఉండే వంట గ్యాస్.. ఇప్పుడు గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికీ ఉన్నాయి. గ్యాస్ లేకుండా ఏమీ తినలేం.. అంతేకాకుండా.. సులభంగా, సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. అయితే.. గ్యాస్ వాడకం ఎక్కువగా ఉండటం వలన, సిలిండర్ ధరలు సామాన్యుడికి తలనొప్పిగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. గ్యాస్ వాడకాన్ని కొద్దిగా తగ్గించినప్పటికీ అనుకున్న సమయానికి ముందుగానే అయిపోతుంది. అయితే.. ఈ చిట్కాలు పాటించడం వలన గ్యాస్ తొందరగా అయిపోకుండా చూడొచ్చు. ఇంతకీ అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. ఈరోజు ఇండియా-అప్ఘనిస్తాన్ మధ్యా సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఇరుజట్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక్కో మార్పు చేశారు.
యూపీలోని బిజ్నోర్‌లో విషాదం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం కారణంగా బావ, మరదలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఈ క్రమంలో.. కొంతకాలం క్రితం వీరు ఇంట్లో నుంచి పారిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. రాఖీ అనే మహిళకు ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు.. వరుసకు బావ అయ్యే డేవిడ్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పడింది. వీరిద్దరు కలిసి నెల రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఎక్కడ తమ పరువు పోతుందని…