Ram Charan: భాషలకు అతీతంగా హీరో రామ్‌చరణ్ పెద్ది సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ఏ అప్డేట్ అయిన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా నుంచి మొదట విడుదలైన “చిక్కిరి చికిరి” పాట రిలీజ్ అయిన వెంటనే సూపర్ హిట్ అయింది. ఈ పాట కేవలం 24 గంటల్లోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించి, ఈ సంవత్సరంలో అత్యధికంగా వీక్షించిన పాటలలో ఒకటిగా చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ సినిమా సెట్‌లో నుంచి పలు ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫోటోలలో హీరో రామ్ చరణ్ ఢిల్లీలో షూటింగ్ చేస్తున్నట్లు కనిపించారు.
READ ALSO: IND vs PAK U19 Asia Cup Final: సమీర్ మిన్హాస్ రికార్డు సెంచరీ.. భారత్ ముందు భారీ లక్ష్యం..
తాజాగా నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలతో ప్రేక్షకులలో పెద్ది సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన రామ్ చరణ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా లీకైన ఫోటోలలో రామ్‌చరణ్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సమీపంలో నడుస్తున్నట్లు కనిపించాడు. ఈసారి రామ్ చరణ్ వెండి తెరపై కొత్త అవతారంలో దర్శనమిస్తాడని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్ది సినిమాను బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా, జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, పలువురు కీలక పాత్రలలో కనిపించనున్నారు.
READ ALSO: Hyperscreen, Alexa+, 800V ఛార్జింగ్.. మెర్సిడెస్ VLEలో అదిరిపోయే ఫీచర్లు