రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ సోమవారం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. తన కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహానికి ఆశీస్సులు పొందేందుకు ఆలయానికి వచ్చినట్లు ఆమె తెలిపారు. రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ వివాహం జూలై 12న జరుగనుంది. ఈ సమయంలో మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భారత్‌తో పాటు విదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. తన కొడుకు, కాబోయే కోడలు కోసం బాబా విశ్వనాథ్ ఆశీస్సులు కోరిన తర్వాత.. నీతా…
కర్ణాటకలో చికెన్ కబాబ్, చేపల వంటకాల్లో కృత్రిమ రంగుల వాడకంపై నిషేధం విధించారు. ఇప్పటికే.. గోబీ మంచూరియన్లో వాడే రంగులపై ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా.. ఈ ఫుడ్ పై నిషేధం విధించింది.
ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సోమవారం గోధుమల నిల్వ పరిమితిని విధించింది. ఇప్పుడు టోకు వ్యాపారులు, బహిరంగ విక్రయదారులు లేదా వ్యాపారులు తమ వద్ద 3 వేల క్వింటాళ్ల కంటే ఎక్కువ గోధుమలను ఉంచుకోలేరు. ఈ నిబంధన అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో వర్తిస్తుంది. గోధుమల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు.. 2025 వరకు ధరలను స్థిరంగా ఉంచి ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం సందడిగా సాగాయి. సార్వత్రిక ఎన్నికల్లో తమ అద్భుతమైన ప్రదర్శనతో ఉల్లాసంగా ఉన్న ప్రతిపక్ష ఎంపీలు.. 18వ లోక్‌సభ సభ్యునిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రాజ్యాంగం కాపీలను ఊపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముందు వరుసలో కూర్చుని నాయకత్వం వహించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ రెండో వరుసలో కూర్చున్నారు. అయితే.. ప్రతిపక్ష హోదాలో మొదటి వరుసలో…
బిజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తన పార్టీకి చెందిన 9 మంది రాజ్యసభ సభ్యులతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. జూన్ 27 నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు ఎగువ సభ సమావేశాలలో బలమైన ప్రతిపక్ష పాత్రను పోషించాలని పట్నాయక్ వారికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను తగిన రీతిలో లేవనెత్తాలని ఎంపీలను కోరారు. సమావేశం అనంతరం రాజ్యసభలో పార్టీ నేత సస్మిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ.. 'ఈసారి బీజేడీ ఎంపీలు కేవలం సమస్యలపై మాట్లాడటానికే పరిమితం కానున్నారు.…
దివంగత బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె, న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ బన్సూరి స్వరాజ్ సోమవారం పార్లమెంట్‌లో లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. 18వ లోక్‌సభ తొలి సెషన్‌లో ఎంపీలు ప్రమాణస్వీకారం చేయగా.. బన్సూరి స్వరాజ్ ప్రమాణస్వీకారం చేసే సమయంలో చప్పట్లతో పార్లమెంట్ ప్రతిధ్వనించింది. ఎందుకంటే బాన్సూరి స్వరాజ్ సంస్కృతంలో ప్రమాణం చేశారు. బన్సూరి స్వరాజ్.. తన తల్లి బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. సుష్మా స్వరాజ్ కూడా తొలిసారి ఎంపీ అయినప్పుడు.. ఆమె సంస్కృతంలో ప్రమాణం చేశారు. ఆమె 16వ లోక్సభలో…
ప్రధాని మోడీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. ప్రధాని మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య చర్చలకు తనను ఆహ్వానించనందుకు ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం, బంగ్లాదేశ్ మధ్య నీటి పంపకంపై చర్చలపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కోల్‌కతా-ఢాకా మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని సీఎం మమతా బెనర్జీ హైలైట్ చేస్తూ.. "సంప్రదింపులు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం లేకుండా ఇటువంటి ఏకపక్ష చర్చలు ఆమోదయోగ్యం కాదు" అని ఆమె పేర్కొన్నారు. గంగా నది,…
దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటే.. ఈ కసాయి తండ్రి మాత్రం కవల ఆడపిల్లలు పుట్టారని చంపేశాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదని.. ఈ క్రమంలో తండ్రి, అతని కుటుంబం ఆ పిల్లలను చంపి.. పూడ్చిపెట్టారు. కాగా.. ఈ ఘటనపై నిందితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో.. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి, న్యాయ ఆదేశాల మేరకు శిశువుల మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం నవజాత శిశువుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం…
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా.. రాజ్యసభ సభా నాయకుడిగా నియమితులయ్యారు. జేపీ నడ్డాను రాజ్యసభలో సభాపక్ష నేతగా చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇంతకుముందు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సభలో ఈ బాధ్యతను నిర్వహించేవారు.. అయితే అతను నార్త్ ముంబై లోక్‌సభ స్థానం నుండి ఎంపీగా ఎన్నికైన తరువాత, అతను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో.. ఈ బాధ్యతను జేపీ నడ్డాకు అప్పగించారు. ఈ నెల ప్రారంభంలో.. జేపీ నడ్డా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ…
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. 18వ లోక్‌సభ మొదటి రోజు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. 2019, 2024కి సంబంధించిన కొంతమంది మహిళా ఎంపీలతో కలిసి ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. 'యోధులు తిరిగి వచ్చారు' అని రాశారు. 2019 ఫొటోలో.. ఎంపీలు మహువా మొయిత్రా, కనిమొళి, సుప్రియా సూలే, జ్యోతిమణి, తమిజాచి తంగపాండియన్‌లు లోక్‌సభలో కూర్చున్నట్లు ఉండగా.. తాజా ఫొటోలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ఉన్నారు.