Parliament Session: లోక్సభలో ముందు వరుసలో కూర్చున్న రాహుల్ గాంధీ.. ఆయనతో పాటు
- 18వ పార్లమెంట్ సమావేశాలు లోక్సభలో ముందు వరుసలో కూర్చున్న రాహుల్ గాంధీ
- గత పార్లమెంట్ సమావేశాల్లో రెండో వరుసలో కూర్చున్న రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం సందడిగా సాగాయి. సార్వత్రిక ఎన్నికల్లో తమ అద్భుతమైన ప్రదర్శనతో ఉల్లాసంగా ఉన్న ప్రతిపక్ష ఎంపీలు.. 18వ లోక్‌సభ సభ్యునిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రాజ్యాంగం కాపీలను ఊపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముందు వరుసలో కూర్చుని నాయకత్వం వహించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ రెండో వరుసలో కూర్చున్నారు. అయితే.. ప్రతిపక్ష హోదాలో మొదటి వరుసలో కూర్చోవడంపై అతని ముఖంలో సంతోషం కనిపిస్తుంది.
AP Crime: బయటకు పొక్కిన గుట్టు.. వదిన, మరిది ఆత్మహత్య..
Also Read
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
ముందు వరుసలో కూర్చున్న వారిలో.. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లతో పాటు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సుదీప్ బందోపాధ్యాయ ఉన్నారు. అయోధ్యలోని రామమందిరం ఉన్న ఫైజాబాద్ ఎన్నికల్లో విజయం సాధించిన అవధేష్ ప్రసాద్‌పై అఖిలేష్ యాదవ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పార్లమెంట్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు అఖిలేష్ యాదవ్‌తో పాటు అతని భార్య డింపుల్ యాదవ్, మామ రామ్ గోపాల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలందరూ తనను ముందుకు తీసుకొచ్చారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీతో సమావేశమైన సమయంలో కూడా అఖిలేష్ యాదవ్ అవధేష్ ప్రసాద్ ను తన పక్కనే ఉంచుకున్నాడు.
CM Revanth Reddy: కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సీఎం రేవంత్ భేటీ
మరోవైపు.. ప్రతిపక్ష నేతలు లోక్ సభలోకి అడుగుపెడుతున్న సమయంలో ప్రధాని మోడీతో సహా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాజ్యాంగ ప్రతులను ఊపుతూ ప్రతిపక్షాలకు స్వాగతం పలికారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ప్రతిపక్ష ఎంపీలు ‘నీట్, నీట్’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు.. లోక్‌సభ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగంపై ప్రధాని మోడీ, అమిత్ షా చేసిన దాడి మాకు ఆమోదయోగ్యం కాదు, అలా జరగనివ్వబోం. అందుకే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగాన్ని నిర్వహించాం…” అని తెలిపారు. లోక్‌సభలో భారత కూటమికి 233 మంది ఎంపీలు ఉండగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 293 మంది ఎంపీలు ఉన్నారు.
తాజావార్తలు
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!