BJD: బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదు.. తేల్చి చెప్పిన బీజేడీ
- బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పార్టీ రాజ్యసభ సభ్యులతో సమావేశం
- పార్లమెంటు సమావేశాలలో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని పిలుపు
- బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదు.. తేల్చి చెప్పిన బీజేడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తన పార్టీకి చెందిన 9 మంది రాజ్యసభ సభ్యులతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. జూన్ 27 నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు ఎగువ సభ సమావేశాలలో బలమైన ప్రతిపక్ష పాత్రను పోషించాలని పట్నాయక్ వారికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను తగిన రీతిలో లేవనెత్తాలని ఎంపీలను కోరారు. సమావేశం అనంతరం రాజ్యసభలో పార్టీ నేత సస్మిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈసారి బీజేడీ ఎంపీలు కేవలం సమస్యలపై మాట్లాడటానికే పరిమితం కానున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒడిశా ప్రయోజనాలను విస్మరిస్తే ఉద్యమించాలని నిర్ణయించాం’ అని తెలిపారు.
Read Also: Kadapa Crime: తల్లితో సహజీవనం.. నిలదీసిన కొడుకు దారుణ హత్య..
Also Read
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఒడిశాకు ప్రత్యేక హోదా డిమాండ్‌ను లేవనెత్తడమే కాకుండా.. రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీ, తక్కువ సంఖ్యలో బ్యాంకు శాఖల సమస్యను కూడా పార్టీ ఎంపీలు లేవనెత్తుతారని సస్మిత్ పాత్ర తెలిపారు. మరోవైపు.. బొగ్గు రాయల్టీలో సవరణ చేయాలన్న ఒడిశా డిమాండ్‌ను గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని.. వారికి దక్కాల్సిన వాటా దక్కకుండా పోతుందన్నారు. రాజ్యసభలో 9 మంది ఎంపీలు బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తారని సుస్మిత్ పాత్రా తెలిపారు.
Read Also: India Squad For Zimbabwe : జింబాబ్వే టూర్కు టీమ్ని ప్రకటించిన బిసిసిఐ.. తెలుగోడికి చోటు..
ఇకపై.. తాము బీజేపీకి మద్దతు తెలిపేది లేదని, ప్రతిపక్షంగానే కొనసాగుతామని తెలిపారు. ఒడిశా ప్రయోజనాలను కాపాడేందుకు ఎంతవరకైనా వెళ్తామన్నారు. ఒడిశా డిమాండ్లను ఎన్డీఏ ప్రభుత్వం విస్మరిస్తే.. బలమైన, శక్తివంతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని తమ అధ్యక్షుడు చెప్పారని సుస్మిత్ పాత్రా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?