సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన పార్లమెంట్ సమావేశాల తొలిరోజు ఎమర్జెన్సీ వర్సెస్ అప్రకటిత ఎమర్జెన్సీపై చర్చ జరిగింది. లోక్ సభ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. 1975లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ప్రస్తావించారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధిస్తున్నామని ప్రకటించిన అనంతరం ప్రభుత్వం దానిని అమలు చేసిందని ప్రధాని మోడీ అన్నారు.ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ గురించి మాట్లాడి ఇంకెంత కాలం పాలించాలనుకుంటున్నారని ప్రధాని మోడీకి కౌంటర్ ఇచ్చారు. ఈ విషయాన్ని…
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సరోగసీ ద్వారా తల్లులైనా ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఆరు నెలల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం 50 ఏళ్ల నాటి నిబంధనను సవరించింది. సరోగసీ అంటే అద్దె గర్భం ద్వారా బిడ్డకు జన్మనివ్వడం. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్, 1972లో చేసిన మార్పుల ప్రకారం.. తల్లి (సరోగసీ ద్వారా జన్మించిన బిడ్డను మోస్తున్న తల్లి) పిల్లల సంరక్షణ కోసం సెలవు తీసుకోవచ్చు.. అంతేకాకుండా.. తండ్రి కూడా 15 రోజుల పితృత్వ సెలవు కూడా తీసుకోవచ్చు.
18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈరోజు (సోమవారం) ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. సెషన్‌కు ముందు ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. సభ్యులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు ప్రజాస్వామ్యానికి గర్వకారణమని అభివర్ణించారు. అంతేకాకుండా.. ఎమర్జెన్సీని ప్రస్తావించారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా జీవించడం గురించి మాట్లాడారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈరోజు అద్భుతమైన రోజు అని ప్రధాని మోడీ అన్నారు.
సోషల్ మీడియాలో హైలెట్ అవడం కోసం జనాలు ప్రాణాలకు మించి తెగిస్తున్నారు. ఇంతకుముందు.. రీల్స్ చేయడం కోసం ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఓ అమ్మాయి ఎత్తైన భవనం నుంచి కిందకు వేలాడుతూ.. ఓ వీడియో తీసింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. తాజాగా.. ఇద్దరు యువకులు రీల్స్ కోసమని రెండు థార్ కార్లను సముద్రంలోకి తీసుకెళ్లారు. ఈ ఘటన గుజరాత్ కచ్‌లోని ముంద్రా సముద్రతీరంలో జరిగింది.
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే.. కామాంధుడిగా మారాడు. బాలికలతో దురుసు, అసభ్యంగా ప్రవర్తించాడు ఓ టీచర్. హిమాచల్‌ప్రదేశ్‌లో బాలికలతో దురుసుగా మాట్లాడిన ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. టీచర్‌పై విద్యార్థినులు చేసిన ఆరోపణలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జోగిందర్‌నగర్ సబ్ డివిజన్‌లోని లడ్‌బాడోల్ ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలకు చెందిన నలుగురు బాలికలు నిందితుడైన ఉపాధ్యాయుడిపై శనివారం ఫిర్యాదు చేశారు. చైల్డ్ హెల్ప్‌లైన్…
టాటా గ్రూప్ కంపెనీ టాటా మోటార్స్.. తన కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వనుంది. తన వాణిజ్య వాహనాల ధరలను జూలై 1 నుంచి 2 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి సరుకుల ధరలు పెరగడంతోనే ఈ మేరకు అన్ని మోడళ్లు, వేరియంట్ల ధరలను పెంచాల్సి వస్తోందని కంపెనీ తెలిపింది. ఇది మొత్తం వాణిజ్య వాహనాల శ్రేణికి వర్తిస్తుందని.. మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతాయని కంపెనీ పేర్కొంది.
చైనాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో.. రానున్న తుఫాను దృష్ట్యా ఎమర్జెన్సీని పొడిగించారు. అక్కడి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. రాబోయే వారంలో యాంగ్జీ నది మధ్య, దిగువ ప్రాంతాలలో నిరంతరంగా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన నేపథ్యంలో ఈ అత్యవసర పరిస్థితి ఏర్పడింది.
రోజూ దినచర్యలో కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్ యాంటీ-ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, విటమిన్లు మరియు కొవ్వులు వంటి అనేక పోషకాల పవర్‌హౌస్‌లు. ఇవి శరీరానికి తగిన పోషణను అందించడంతో పాటు శక్తిని నింపుతాయి. అయితే.. చాలా మంది నీటిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటారు. అయితే.. అలా కాకుండా.. తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం చాలా ఆరోగ్యకరమైనదని మీకు తెలుసా. ఎందుకంటే…
'టీ' అంటే తాగని వారు ఎవరూ ఉండరు. తలనొప్పి ఉన్నా.. పనిలో ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందాలన్నా టీ తాగాల్సిందే. మరీ ముఖ్యంగా ఉదయం లేవగానే ఛాయ్ లేకపోతే.. ఆ రోజంతా తలనొప్పిగా ఉంటుంది. అందుకోసమని వేడి వేడిగా ఒక గ్లాస్ ఛాయ్ తాగితే ఉపశమనం కలిగిస్తుంది. తమ రుచి మరియు ఆరోగ్యాన్ని బట్టి.. గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, మిల్క్ టీలను తాగుతుంటారు. వీటిలో మిల్క్ టీ అంటే చాలా మందికి ఇష్టం. పాలలో ఎక్కువ టీ ఆకులు వేసి…
యూపీలోని ఆగ్రాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసుల వేధింపులతో విసిగిపోయిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూపధాను గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఏసీపీ డా.సుకన్య శర్మ, బర్హాన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.