Mahua Moitra: ‘వారియర్స్ ఆర్ బ్యాక్’.. మహిళా ఎంపీలతో ఉన్న ఫొటో పోస్ట్
- లోక్‌సభ మొదటి రోజు సమావేశానికి హాజరైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా
- 2019.. 2024కి సంబంధించిన కొంతమంది మహిళా ఎంపీలతో కలిసి ఉన్న ఫొటో పోస్ట్
- 'యోధులు తిరిగి వచ్చారు' అని క్యాప్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. 18వ లోక్‌సభ మొదటి రోజు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. 2019, 2024కి సంబంధించిన కొంతమంది మహిళా ఎంపీలతో కలిసి ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియా వేదిక ‘x’లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. ‘యోధులు తిరిగి వచ్చారు’ అని రాశారు. 2019 ఫొటోలో.. ఎంపీలు మహువా మొయిత్రా, కనిమొళి, సుప్రియా సూలే, జ్యోతిమణి, తమిజాచి తంగపాండియన్‌లు లోక్‌సభలో కూర్చున్నట్లు ఉండగా.. తాజా ఫొటోలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ఉన్నారు.
Read Also: Mallikarjun Kharge: ప్రధాని మోడీ ‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలపై ఖర్గే కౌంటర్..
Also Read
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
మహువా మొయిత్రా.. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. కనిమొళి తమిళనాడులోని తూత్తుకుడి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. మహారాష్ట్రలోని బారామతి స్థానం నుండి సుప్రియా సూలే, తమిళనాడులోని చెన్నై సౌత్ వెస్ట్ కరూర్ నుండి తమిజాచి తంగపాండియన్, ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి లోక్‌సభ స్థానం నుండి డింపుల్ యాదవ్ ఎంపీగా గెలుపొందారు. ఈ మహిళా ఎంపీలందరూ 18వ లోక్‌సభలో ప్రతిపక్ష పాత్ర పోషించనున్నారు.
Read Also: Bhatti Vikramarka: ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి.. శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం
18వ లోక్‌సభలో మొత్తం 74 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. 2019లో 78 మంది మహిళా ఎంపీలు ఉంటే.. ఇప్పుడు మరో 4 తగ్గారు. మహిళా ఎంపీల పరంగా పశ్చిమ బెంగాల్ ముందంజలో ఉంది. ఇక్కడ నుండి 11 మంది మహిళా ఎంపీలు విజయం సాధించారు. మరోవైపు.. 18వ లోక్‌సభ తొలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ తన క్యాబినెట్ మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ప్రొటెం స్పీకర్ నియామకం, పార్లమెంట్ కాంప్లెక్స్‌లో విగ్రహాల స్థానభ్రంశం, నీట్ పేపర్ లీక్‌పై విపక్షాలు రచ్చను సృష్టిస్తూనే ఉన్నాయి.
The warriors are back ! 2024 vs 2019@KanimozhiDMK @dimpleyadav @supriya_sule @jothims @ThamizhachiTh pic.twitter.com/D1lJGHFFhb
— Mahua Moitra (@MahuaMoitra) June 24, 2024
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!