వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నిలిపివేసిన వ్యవసాయ పథకాలు ఏంటి.. అందుకు గల కారణాలను డిప్యూటీ సీఎం సమావేశంలో వ్యవసాయ అధికారులను కోరారు. కేంద్ర ప్రభుత్వంతో మ్యాచింగ్ ద్వారా వచ్చే పథకాలు, నిధులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు తెలిపారు. పంటల బీమాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల…
సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీకి వెళ్లిన వారిలో మంత్రి సీతక్క కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ని తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కలిశారు. తెలంగాణలో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మేల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బీఫాం పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. వారి సభ్యత్వం రద్దు కావాల్సి ఉందని.. వారిపై పిటిషన్ ఇవ్వాలని స్పీకర్ ను సమయం కోరామని జగదీష్ రెడ్డి తెలిపారు. ఈరోజు లేదా రేపు సమయమిస్తానని స్పీకర్ చెప్పారన్నారు. గతంలో పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు వీరిద్దరి సభ్యత్వాలు రద్దు…
ఎర్రవెల్లి ఫాంహౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీటింగ్ ముగిసింది. ఈ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేక్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణా రావు, ప్రకాష్ గౌడ్, అరికేపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్ పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితులపై వారితో చర్చించారు. ఈ క్రమంలో.. గులాబీ దళపతి కేసీఆర్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి నారా లోకేష్ను క్రికెటర్ హనుమ విహరి కలిశారు. జగన్ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. ఏసీఏతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో.. తిరిగి ఏసీఏ తరపునే ఆడాలని హనుమ విహారి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా క్రికెటర్ హనుమ విహారి మాట్లాడుతూ.. తన టాలెంటును గత ప్రభుత్వం తొక్కేసిందని ఆరోపించారు. తానుంటే వాళ్లకి ఇబ్బందని నాటి ఏసీఏ భావించిందని తెలిపారు. చిన్న విషయాన్ని పెద్దదిగా చూపి.. తనతో రాజీనామా…
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బరేలీలోని నవాబ్‌గంజ్‌లో ఓ యువకుడి పెళ్లి విందులో చపాతీల విషయంలో ఘర్షణ తలెత్తింది. అయితే.. కొందరు యువకులు వేడి వేడి చపాతీలు తమకు అందలేదని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో.. తమకు చపాతీలు ఇవ్వలేదని నానా హంగామా సృష్టించారు. ఈ క్రమంలో.. యువకులకు, వరుడి కుటుంబీకుల మధ్య గొడవ జరిగింది. దీంతో.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. కాగా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎం) 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. ఎన్‌హెచ్ఎంలో 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ.231.40 కోట్లు మంజురు చేయాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూతలు... ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు అని విమర్శించారు. మరోవైపు.. రైతుబంధు ఎప్పుడు ఇస్తారని జనం తమను అడుగుతున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ అంతా చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. 2018 కంటే ముందు మిగిలిన వ్యవసాయ రుణమాఫీ ఏం చేస్తరని కాంగ్రెస్ ప్రభుత్వంను అడుగుతున్నామని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నంబర్ 82లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. జర్నలిస్టు కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న బహుళ అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో.. స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అయితే.. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరగడంతో.. పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. మంటలను చూసిన సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులు వెంటనే బయటకు పరుగులు తీశారు. కాగా.. ఈ ప్రమాదంపై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే…
తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా మరణాల సంఖ్య 58కు చేరింది. మరోవైపు.. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 156 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 110 మంది కళ్లకురిచి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.