చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డీజిల్ రెట్లు తగ్గినా కూడా బస్సు చార్జీలు పెంచిన ఘనత జగన్ ది అని ఆరోపించారు. జగన్ మాటలు ప్రజలు వినే పరిస్థితి లేదని అన్నారు. మరోవైపు.. శాఖల్లో ఏదైనా అవినీతి జరిగి ఉంటే, తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా.. ఏ రాజకీయ సభలకు ఫ్రీగా బస్సులు ఉపయోగించమని అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. ఆరు రోజులుగా డయేరియా కేసులు ప్రభుత్వాస్పత్రికి వస్తూనే ఉన్నాయి. జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కొందరు వాంతులు, విరేచనాలతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ప్రస్తుతం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు పేషేంట్లకు విజయవాడలో చికిత్స అందిస్తున్నారు. కొంత మందికి పరిస్థితి సాధారణమై డిశ్చార్జ్ అయ్యారు.
చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి ఆవలి వైపు నమూనాలు సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండో వైపు నుంచి మట్టి, శిథిలాలను మోసుకుని చాంగే-6 వ్యోమనౌక భూమిని చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతాల్లో ఇది సురక్షితంగా ల్యాండ్ అయింది. మే 3వ తేదీన చాంగే-6 నింగికెగిరి దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. మరోవైపు.. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. అలాగే నిన్న (సోమవారం) అర్ధరాత్రి వరకు 71,824 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,462 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండి ఆదాయం 4.01 కోట్లు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు కుప్పంలో పర్యటించనున్నారు. రెండో రోజు షెడ్యూల్లో భాగంగా.. కుప్పం ఆర్ అండ్ బి అతిధి గృహము నందు ఉదయం10.30 గంటలకు ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నారు. అనంతరం.. మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు కుప్పం నియోజకవర్గ అధికారులతో సమీక్షా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆడిటోరియం నందు పార్టీ శ్రేణులతో సమావేశం చేపట్టనున్నారు. ఆ తర్వాత.. 4.10 గం.లకు అక్కడే ఏర్పాటు…
తన మరదలు పై కన్నేసాడని తన మిత్రులతో కలిసి యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ బేగంపేటలోని పాటిగడ్డలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. పాటిగడ్డకు చెందిన ఉస్మాన్ అనే యువకుడు స్థానిక యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బావ అజజ్.. తన మరో ముగ్గురు మిత్రులతో కలిసి పాటిగడ్డలో ఉంటున్న అతని దగ్గరికి వెళ్లి రాత్రి సమయంలో యువకుడిని అడ్డగించారు. ఆ తర్వాత.. నలుగురు యువకులు కలిసి ఉస్మాన్ పై కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా చంపేశారు.…
పానీపూరి అంటే ముఖ్యంగా చిన్న పిల్లలకు చాలా ఇష్టం. దానిని లొట్టలేసుకుని తింటుంటారు. అంతేకాకుండా.. సరిపోకుంటే ఇంటికి పార్శిల్ తెచ్చుకుని మరీ తింటారు. అయితే.. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు పానీపూరీని తింటున్నారు. గల్లీలో ఇటు చివర.. అటు చివర దర్శనమిస్తాయి. అయితే.. అదే పానీపూరి ఓ అత్త కోడలు మధ్య గొడవకు కారణమైంది. అసలు విషయానికొస్తే.. పానీపూరీలు తీసుకొచ్చిన భర్త తన కంటే ముందే తల్లికి పెట్టాడని భార్యకు కోపం వచ్చింది. దీంతో.. రాత్రంతా రోడ్డుపైనే హైవోల్టేజీ డ్రామా నడిచింది. ఆ…
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశం కావడంతో పాటు తెలంగాణ నుంచి ఎంపీకైన లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు వైరి పక్షమైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ప్రాధాన్యంగా సమాఖ్య స్ఫూర్తిని అనుసరించి కేంద్ర మంత్రులను కలిసి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.
గుప్తనిధుల పేరుతో బడా మోసం చేస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 15 లక్షల 47 వేల నగదు, 540 వెండి రేకు నాణేలు, 76 బంగారు రేకు నాగ పడిగ బిల్లలు, పూజ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో.. జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ వివరాలను వెల్లడించారు.
హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఆపరేషన్ మొబిలైజేషన్-OM చారిటీ గ్రూప్‌పై 11 చోట్ల ఈడీ సోదాలు చేసింది. విదేశాల నుంచి విరాళాలు తీసుకుని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేపట్టింది. రూ.300 కోట్ల విరాళాలు సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయని వారు తెలిపారు.