JP Nadda: రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా జేపీ నడ్డా నియామకం..
- రాజ్యసభ సభా నాయకుడిగా జేపీ నడ్డా నియామకం
- ఇంతకుముందు పీయూష్ గోయల్ ఈ సభకు బాధ్యతలు
- నార్త్ ముంబై లోక్‌సభ స్థానం నుండి ఎంపీగా గెలిచిన పీయూష్
- రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా.. రాజ్యసభ సభా నాయకుడిగా నియమితులయ్యారు. జేపీ నడ్డాను రాజ్యసభలో సభాపక్ష నేతగా చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇంతకుముందు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సభలో ఈ బాధ్యతను నిర్వహించేవారు.. అయితే అతను నార్త్ ముంబై లోక్‌సభ స్థానం నుండి ఎంపీగా ఎన్నికైన తరువాత, అతను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో.. ఈ బాధ్యతను జేపీ నడ్డాకు అప్పగించారు. ఈ నెల ప్రారంభంలో.. జేపీ నడ్డా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బాధ్యతలను స్వీకరించారు. అంతేకాకుండా.. రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ కూడా కేటాయించారు.
Sapthami Gowda : నేను తప్పు చేశా.. నేను మధ్యలోకి రాను..సప్తమి గౌడ ఎమోషనల్ ఆడియో వైరల్!
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
ఇదిలా ఉంటే.. త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి జేపీ నడ్డా రిలీవ్ అయ్యే అవకాశ ఉంది. ఈ క్రమంలో.. తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు కోసం అన్వేషణ ముమ్మరం చేసింది. కాగా.. మరికొన్ని రోజుల్లో బీజేపీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించనుంది. పార్టీ చట్టాల ప్రకారం.. అన్ని రాష్ట్రాలలో 50 శాతం సంస్థ ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
నడ్డా రాజకీయ జీవితం 1975లో జేపీ (JP) ఉద్యమం ద్వారా.. ఓ కార్యకర్తగా వెలుగులోకి వచ్చారు. ఆ తరువాత.. అతను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) లో చేరాడు. పాట్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సెంట్రల్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేశారు. 1977లో కార్యదర్శిగా నియమితులయ్యారు. జేపీ నడ్డా.. 1977-1979 మధ్య రాంచీలో విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2012లో తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన.. 2014లో బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడయ్యారు. అంతకుముందు.. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ అసెంబ్లీకి 1993-2007 వరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!