బీఎండబ్ల్యూ (BMW)మోటోరాడ్.. తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియా మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. BMW CE 04గా పిలిచే ఈ స్కూటర్ జూలై 24న ప్రారంభం కానుంది. ప్రీమియం తయారీదారు నుంచి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో భారత మార్కెట్లో ఈ బీఎండబ్ల్యూ సీఈ 04కు ప్రత్యక్ష పోటీదారులు ఎవరూ లేరు.
మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో 20 ఏళ్ల యువతిపై ఏడాదిన్నరగా అత్యాచారం చేసిన ఉదంతం వెలుగు చూసింది. అంతేకాకుండా.. అత్యాచారం వీడియో తీసినట్లు బాధితురాలు చెబుతోంది. నిందితుడు తనకు సోషల్ మీడియాలో పరిచయమయ్యాడని తెలిపింది. ఈ క్రమంలో తనను బెదిరించి అనేకసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తుంది. అతని వేధింపుల వల్ల ఏడాదిన్నరలో మూడు ఇళ్లను మార్చింది. అయితే నిందితుడిపై ఆగడాలు తట్టుకోలేక హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టింది. అత్యాచారం, దాడి సహా పలు సెక్షన్ల…
ల్యాప్టాప్ కొనేందుకు మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉందా.. అయితే యాపిల్ కంపెనీ ఓ శుభవార్త చెప్పింది. యాపిల్ మ్యాక్ బుక్ (Apple MacBook)ని తక్కువ ధరకే అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ల్యాప్ టాప్ లు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. M1 చిప్‌సెట్‌తో కూడిన మోడల్ ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా రూ. 31,000 డిస్కౌంట్ ఇస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లో రూ. 5,000 ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. అదేవిధంగా.. M2 చిప్‌సెట్‌తో కూడిన మ్యాక్‌బుక్ మోడల్ కూడా భారీ తగ్గింపుతో లభిస్తుంది. దీనికి…
యూపీలోని హమీర్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి సూసైడ్ చేసుకుంది. ఒక్కసారి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటన ముస్కరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంద్వా గ్రామంలో చోటుచేసుకుంది.
యూపీలోని ఆగ్రా సిటీ జోన్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో నియమించబడిన ఇన్‌స్పెక్టర్‌పై ట్రైనీ ఇన్‌స్పెక్టర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై ఒత్తిడితో ఇన్‌స్పెక్టర్ తనను గదికి పిలిచారని ఆరోపించారు. ఈ ఘటనపై ట్రైనీ మహిళా ఇన్‌స్పెక్టర్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. రెండు రోజుల్లో ఏసీపీ ఎత్మాద్‌పూర్ సుకన్య శర్మ నుంచి విచారణ నివేదిక కోరారు.
తలలో పేను.. ఇది చూడ్డానికి చాలా చిన్న సమస్యే అయినా.. తెగ ఇబ్బంది పెడుతుంది. తలలో దురదతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు ఈ దురద జుట్టులో పేరుకుపోయిన మురికి ఏర్పడుతుంది. ఈ క్రమంలో.. పేను తయారవుతాయి. ఇవి జుట్టులో తన పనిని తాను చేసుకుంటూ వెళ్తాయి. ఈ పేలులు రక్తాన్ని పీల్చడమే కాకుండా.. ఇతర సమస్యలకు దారితీస్తాయి. తలపై పేలు ఉండి గోకితే ఇన్ఫెక్షన్‌తో పాటు స్కాల్ఫ్ హెయిర్ రూట్స్ బలహీనపడతాయి. ఇది జుట్టు రాలే సమస్యని పెంచుతుంది.
శనివారం పూణె-నాసిక్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ఎమ్మెల్యే మేనల్లుడు ప్రయాణిస్తున్న కారు రాత్రి ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మయూర్ మోహితను అరెస్ట్ చేశారు. పూణే జిల్లాలోని ఖేడ్ అలండి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే దిలీప్ మోహితే పాటిల్ మేనల్లుడు మయూర్. దిలీప్ మోహితే పాటిల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే. కాగా.. ప్రమాదంలో…
మంత్రాలు చేస్తోందన్న అనుమానంతో ఓ మహిళపై క్రూరత్వం చూపించారు. కనికరం లేకుండా.. దాడి చేశారు. ఈ ఉదంతం ఉత్తర ప్రదేశ్లోని సూరజ్‌పూర్ ఖేడీ గ్రామంలో చోటు చేసుకుంది. అయితే.. తమ కూతురు అనారోగ్యానికి కారణం ఆ మహిళేనని.. తాను చేతబడి చేస్తుందని అనుమానించారు. దీంతో.. బాలిక కుటుంబీకులు ఆ మహిళను తీవ్రంగా కొట్టారు. అంతే కాకుండా జుట్టు కూడా కత్తిరించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో.. బంగ్లాదేశ్ ముందు 197 పరుగుల టార్గెట్ను పెట్టింది. టీమిండియా బ్యాటింగ్లో హార్ధిక్ పాండ్యా (50*) అర్ధసెంచరీతో చెలరేగాడు. అతనికి తోడు శివం దూబే (34) మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. హార్ధిక్ ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి.
ఢిల్లీలో ఓ దపంతుల జంట వేర్వేరు చోట్ల ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు ఈశాన్య రాష్ట్రమైన అస్సాంకు చెందినవారిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు శనివారం సమాచారం అందించారు. జుమీ దాస్, ఆమె భర్త భాస్కర్ దేకా (27)గా పోలీసులు తెలిపారు. కాగా.. ఝుమీ దాస్ హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేసింది. భర్త చాందినీ చౌక్ ప్రాంతంలోని ఓమాక్స్ మాల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వాడు.