కర్నాటకలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యాయి. గత 15 నెలల వ్యవధిలో 1,182 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు తీవ్రమైన కరువు, పంట నష్టం మరియు విపరీతమైన అప్పులు అని రెవెన్యూ శాఖ పేర్కొంది.
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడి పై నుంచి వాటర్ ట్యాంకర్ వెళ్లడంతో తీవ్ర గాయాలైన అతన్ని ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనకు సంబంధించిన మొత్తం వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం రష్యా వెళ్లారు. ఈరోజు మాస్కోలో ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కానున్న ప్రధాని, ఆయనతో పలు అంశాలపై చర్చించనున్నారు. దాదాపు ఐదేళ్లలో ప్రధాని మోదీ రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.
జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో సోమవారం ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు కొండపై నుండి ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారు. అంతేకాకుండా.. గ్రెనేడ్లు కూడా విసిరారని అధికారులు తెలిపారు. కాగా.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. గత నెల జూన్ 11, 12 తేదీల్లో జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రదాడులతో దద్దరిల్లింది.
ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఘోర బీఎండబ్ల్యూ కారు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో హిట్ అండ్ రన్ ఘటనలు పెరిగిపోవడం పట్ల సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. హిట్ అండ్ రన్ నేరస్థులను సహించేది లేదని అన్నారు.
నీట్ (NEET UG 2024) పరీక్షలో హాజరైన 23 లక్షల మంది విద్యార్థులకు ఈ రోజు ముఖ్యమైన రోజు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) 2024ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని తిరిగి నిర్వహించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన 38 పిటిషన్లపై ఈరోజు అంటే జూలై 8 సోమవారం విచారణ జరుగుతోంది. ఈ కేసులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దీన్ని చేపట్టింది.…
రైలు పట్టాలపై మనిషి పడి.. రైలు వెళ్తే బతకడం కష్టమే. అలాంటిది ఓ మహిళను సురక్షితంగా కాపాడారు. ఆమెను రక్షించడం కోసమని.. మహిళపై నుంచి వెళ్లిన రైలు, మళ్లీ నెమ్మదిగా వెనక్కి వెళ్లింది. ఈ ఘటన సోమవారం నవీ ముంబైలోని రైల్వేస్టేషన్లో జరిగింది. ట్రాక్‌పై పడిపోయిన 50 ఏళ్ల మహిళ పై నుంచి లోకల్ ట్రైన్ వెళ్లింది. దీంతో.. రైల్వే అధికారులు వెంటనే స్పందించి వెనక్కి తీసుకురావడంతో మహిళను రక్షించారు. అయితే.. ఆ మహిళ ప్రాణపాయం నుంచి బయటపడినప్పటికీ కాళ్లకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి.
సోమవారం తెల్లవారుజామున ముంబై.. శివారు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. దీంతో.. రోడ్లు, లోతట్టు ప్రాంతాలపై భారీగా నీరు నిలిచింది. భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు.. భారీ వర్షం దృష్ట్యా కొన్ని రైలు సర్వీసులను రద్దు చేయగా, ముంబై విమానాశ్రయంలో 27 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. నగరంలో తెల్లవారుజామున 1 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు శాఖ అధికారులు తెలిపారు.
జింబాబ్వే టూర్‌లో పలువురు యువ ఆటగాళ్లకు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ పర్యటనలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభ్‌మన్ గిల్ మొదటి మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్లకు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చాడు. కానీ ఈ ముగ్గురిలో ఎవరూ బ్యాటింగ్ లో రాణించలేకపోయారు. తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురైల్‌లు టీమిండియా తరఫున అరంగేట్రం చేసినా తొలి మ్యాచ్‌లో…
అనకాపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై కత్తితో దాడి చేసి ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఇంట్లోకి చొరబడి కత్తితో అతి దారుణంగా గొంతు కోసి యువకుడు పరారయ్యాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండు పాలెం లోచోటుచేస్తుంది. 9వ తరగతి చదువుతున్న బద్ది దర్శిని(14) బాలికపై సురేష్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో.. ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. కాగా.. సంఘటన స్థలంలోనే నిందితుడు కత్తి వదిలేసి పరారయ్యాడు.