ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఘోర బీఎండబ్ల్యూ కారు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో హిట్ అండ్ రన్ ఘటనలు పెరిగిపోవడం పట్ల సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. హిట్ అండ్ రన్ నేరస్థులను సహించేది లేదని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ధనవంతులైనా, రాజకీయ నాయకులు, వారి పిల్లలు అయినా అన్యాయాన్ని సహించనని తెలిపారు. హిట్ అండ్ రన్ నేరస్థులకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాలను, కఠిన శిక్షలను అమలు చేస్తోందని షిండే ట్వీట్‌లో పేర్కొన్నారు.
MP: 15 నిమిషాల్లో రెండు సార్లు మంత్రిగా ప్రమాణం చేసిన రావత్
‘సాధారణ ప్రజల జీవితాలు మాకు విలువైనవి. ఈ కేసులను అత్యంత సీరియస్‌గా తీసుకుని.. న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర పోలీసు శాఖను నేను ఆదేశించాను.’ రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని షిండే చెప్పారు. బాధితులకు, వారి కుటుంబాలకు తన ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
Etela Rajender: ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలో కూల్చివేతలపై మండిపడిన ఈటల..
కాగా.. ఆదివారం తెల్లవారుజామున 5.20 గంటలకు ముంబైలోని వర్లీ ప్రాంతంలో మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచ్చింది. శివసేన షిండే వర్గానికి చెందిన ఓ నాయకుడి కుమారుడు మిహిర్ షా తన బిఎమ్‌డబ్ల్యూ కారుతో బైక్‌పై వెళ్తున్న దంపతలును ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందింది. ఆ కారు మహిళను 2 కిలోమీటర్లకు పైగా ఈడ్చుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మరోవైపు.. ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున వేగంగా వస్తున్న కారు స్కూటర్‌ను ఢీకొట్టడంతో డ్యూటీలో ఉన్న పూణే పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు.