కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. డిసెంబర్ 2025లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాల్సిందేనని తెలిపారు. ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించండి.. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రతీ నెలా ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలని కోరారు.
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దందాల కోసం, కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజా పాలనకోసం కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. ప్రజల పేగు బంధాన్ని తెంచిందే కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తాడని దుయ్యబట్టారు.
మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లాలో మొత్తం రూ. 396.09 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో.. రూ.353.66 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. అంతేకాకుండా.. పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. త్వరలోనే మహిళలకు మీసేవ, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుందని అన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఆమె ప్రారంభించారు.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియాలో ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు (Mercedes-Benz EQA) మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు భారతదేశంలో బ్రాండ్లలో చౌకైన ఎలక్ట్రిక్ కారుగా మారింది
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల దృష్ట్యా ప్రజలు సీఎన్జీ (CNG) కార్ల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ కార్లు డబ్బులు ఆదా చేయడంతో పాటు పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే.. మీరు రూ.10 లక్షల లోపు సీఎన్జీ కారును కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే.. రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో కార్లు ఉన్నాయి.
కర్ణాటకలోని యాదగిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను అంగీకరించడం లేదని పదహారేళ్ల యువతి దారుణానికి ఒడిగట్టింది. యువకుడి మూడు నెలల కోడలును బావిలో పడేసి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జూలై 6వ తేదీన జరిగింది. యువతికి పాప మేనమామ యల్లప్పతో గత రెండేళ్లుగా ఇష్టపడుతుంది. అంతేకాదు.. ఐదుసార్లు ప్రపోజ్ కూడా చేసింది. అయితే.. యల్లప్ప తమ కుటుంబ సంబంధాల గురించి చెబుతూ పలుమార్లు ఆమె ప్రేమను తిరస్కరించాడు.
ప్రస్తుతం ఎవరి ఇంట్లో చూసినా ఫ్రిజ్ ఉంటుంది. అయితే ఫ్రిజ్‌ను ఉపయోగించే సమయంలో తెలిసో తెలియకో మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. మరీ ముఖ్యంగా ఎండకాలంలో బయట ఏ ఆహారాన్ని ఉంచినా త్వరగా పాడైపోతాయి. దీంతో వాటిని ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అందులో పెడితే ఫ్రెష్‌గా ఉంటాయని భావిస్తాం. అయితే.. ఫ్రిజ్‌లోని చల్లదనం వల్ల ఆయా ఆహార పదార్థాలు పోషకాలు కోల్పోతాయనే సంగతి మీకు తెలుసా? కొన్ని పదార్థాలైతే తమ స్వభావాన్ని కోల్పోవడమే కాదు.. విషంగా మారతాయి.
ఉత్తరాఖండ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా.. జరిమానా కూడా విధించింది. ఈ కేసులో ప్రత్యేక, జిల్లా సెషన్స్ జడ్జి ధరమ్ సింగ్ తీర్పు చెప్పారు. రూ. 5000 జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో 30 రోజుల అదనపు సాధారణ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తన నిర్ణయంలో పేర్కొంది. బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు…
ఇప్పటికే టెలికాం ఛార్జీలను సవరించిన రిలయన్స్ జియో... కొత్తగా డేటా బూస్టర్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. 1జీబీ, 1.5జీబీ మొబైల్ డేటా ప్లాన్లు రీఛార్జి చేసిన యూజర్ల కోసం వీటిని తీసుకొచ్చింది. ఈ కేటగిరీకి చెందిన మొబైల్ యూజర్లు ఈ ప్లాన్లతో రీఛార్జి చేసుకుంటే 4జీ డేటాతో పాటు అపరిమిత డేటా సేవలను ఆనందించొచ్చు. వీటి ధర రూ.51 నుంచి ప్రారంభమవుతుంది. రూ. 101, రూ. 151 ఉంది.