ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ మినహా భారత బ్యాట్స్‌మెన్లు ఎవరూ రాణించలేదు. ఈ క్రమంలో.. 102 పరుగులకే ఆలౌటైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 115 పరుగులు చేసింది. భారత్ తక్కువ పరుగులకే కట్టడి చేసిందని.. 116 పరుగుల లక్ష్యాన్ని ఈజీగానే సాధిస్తుందని అనుకున్నారు. కానీ.. అంతా రివర్స్ అయిపోయింది. జింబాబ్వే బౌలర్ల ముందు యువ భారత్ చేతులెత్తేసింది.
రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న పదహారేళ్ల విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. మరణించిన విద్యార్థి యతేంద్ర ఉపాధ్యాయగా గుర్తించారు. అయితే.. నిన్ననే తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోగా, ఈరోజు గుండెపోటుతో మరణించాడు. బండికుయ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో తరగతి గది లోపలికి వస్తుండగా ఒక్కసారిగా పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫస్ట్ కాన్వకేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యూనివర్సిటీ ఫౌండర్ (చైర్మైన్) మల్లారెడ్డి, రిజిస్టార్ అంజనేయులు, వైస్ చైన్సలర్ విఎస్.కె రెడ్డితో పాటు యూనివర్సిటీ ప్రెసిడెంట్ భద్రారెడ్డి, డైరెక్టర్లు శాలిని రెడ్డి, ప్రీతిరెడ్డి, ప్రవిణ్ రెడ్డిలు పాల్గొని జ్యోతి ప్రజ్వాళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ హర్షణీయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విభజనకు సంబంధించి ఆస్తులు, అప్పులు పంపకాలకు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు నేరుగా భేటీ కావడం వలన అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత్ తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే 115 పరుగులు మాత్రమే చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఈ పరుగులు సాధించింది.
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. అమాయక బాలుడిని ఓ మృగాడు పొట్టన పెట్టుకున్నాడు. తాగిన మైకంలో ఏమీ ఏర్పడక కడతేర్చారు. బాలుడిని దారుణంగా నేలకేసి కొట్టి చంపాడు సవతి తండ్రి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాసేపట్లో హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారంతో పాటు పలు ఇతర అంశాలపైనా ఇద్దరు సీఎంలు దృష్టి సారిస్తారు. ఇద్దరూ సీఎంలు అయ్యాక తొలిసారి భేటీ కానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. రెండు రాష్ట్రాల సీఎంల భేటీపై పలువురు నేతలు ఆసక్తికర ట్వీట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో అధికారులతో భేటీ ముగిసింది. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించాల్సిన అంశాలపై చర్చించారు. ఏపీ, తెలంగాణ విభజన అంశాలపై చర్చించాల్సిన అంశాలను సీఎం చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు. సాయంత్రం 5:30 గంటల తరువాత సీఎం చంద్రబాబు ప్రజాభవన్ బయలుదేరనున్నారు. అనంతరం.. షెడ్యూల్ 9, 10 లో ఉన్న ప్రభుత్వ సంస్థల ఆస్తుల పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్, జింబాబ్వేతో టీ20 సిరీస్‌లకు యువ జట్టు సిద్ధమైంది. కాసేపట్లో హరారే వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ టూర్‌లో యువ భారత్ బరిలోకి దిగుతుంది. టీమిండియాకు యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్ కోసం ఐపీఎల్‌కు చెందిన పలువురు స్టార్ ఆటగాళ్లు భారత జట్టులోకి వచ్చారు. అభిషేక్ శర్మ, రియాగ్ పరాగ్, ధృవ్ జురెల్ అంతర్జాతీయ టీ20లో అరంగేట్రం చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా రామపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి మంత్రి మాట్లాడుతూ.. రాయచోటి-కడప మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడం బాధాకరం, దురదృష్టకరం అని అన్నారు. మరణాలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు వల్లే సంభవిస్తున్నాయి.. దయచేసి ఎవరు మద్యం తాగి వాహనాలు నడపరాదని తెలిపారు.