Mumbai Rains: ముంబైలో భారీ వర్షం.. నిలిచిపోయిన విమాన, రైళ్ల సర్వీసులు
- ముంబైలో భారీ వర్షం
- ఆరు గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
- నీట మునిగిన రహదారులు.. లోతట్టు ప్రాంతాలు
- 27 విమానాల దారి మళ్లింపు
- పాఠశాలలు
- కళాశాలలకు హాఫ్ డే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం తెల్లవారుజామున ముంబై.. శివారు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. దీంతో.. రోడ్లు, లోతట్టు ప్రాంతాలపై భారీగా నీరు నిలిచింది. భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు.. భారీ వర్షం దృష్ట్యా కొన్ని రైలు సర్వీసులను రద్దు చేయగా, ముంబై విమానాశ్రయంలో 27 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. నగరంలో తెల్లవారుజామున 1 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు శాఖ అధికారులు తెలిపారు. అంధేరి, కుర్లా, భాండూప్, కింగ్స్ సర్కిల్, విలే పార్లే మరియు దాదర్‌తో సహా అనేక ప్రాంతాలలో నీరు భారీగా చేరింది.
ఇదిలా ఉంటే.. భారీ వర్షం కారణంగా ముంబైలో పాఠశాలలు మూసివేయశారు. BMC పౌర సంస్థ పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు హాఫ్ డే సెలవు ప్రకటించింది. తరగతుల మధ్యాహ్నం సెషన్‌పై నిర్ణయం తర్వాత ప్రకటిస్తారు. భారీ వర్షం కారణంగా ముంబై విమానాశ్రయంలో రన్‌వే కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. సోమవారం తెల్లవారుజామున 2.22 నుండి 3.40 వరకు 27 విమానాలను దారి మళ్లించారు. అహ్మదాబాద్, హైదరాబాద్, ఇండోర్ వంటి ఇతర నగరాలకు విమానాలను మళ్లించామని, ప్రస్తుతం విమానాల రాకకు ప్రాధాన్యత ఇస్తున్నామని అధికారి తెలిపారు.
Also Read
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
Read Also: MLC Kavitha: కవిత పిటిషన్ పై విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..
ముంబై విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు విమానాశ్రయానికి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. “వాతావరణం అనుకూలంగా లేకపోవడం, భారీ నుండి అతి భారీ వర్షాల సూచనల దృష్ట్యా.. ముంబై విమానాశ్రయం ప్రయాణికులందరూ తమ తమ విమానయాన సంస్థలతో తమ విమాన స్థితిని తనిఖీ చేసి, కొంచెం ముందుగా విమానాశ్రయానికి బయలుదేరాలని తెలిపారు. అటు.. రైళ్లు కూడా రద్దు చేశారు. సెంట్రల్ రైల్వే MMR-CSMT (12110), పూణే-CSMT (11010), పూణే-CSMT డెక్కన్ (12124), పూణే-CSMT డెక్కన్ (11007) మరియు CSMT-పూణే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12127) రైళ్లను రద్దు చేశారు. ట్రాక్‌ల నుండి నీరు తగ్గిన తర్వాత లోకల్ రైలు సర్వీసులను పునఃప్రారంభించారు.
భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులు నీటమునిగాయి. దీంతో.. సోమవారం ఉదయం విపరీతంగా ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు.. పౌర సంస్థ ముంబై వాసులకు హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మరికొన్ని గంటల్లో నగరంలో భారీ వర్షం కురుస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం ముంబైలో మేఘావృతమై ఉంది. ఈ క్రమంలో.. నగరవాసులు సురక్షితంగా ఉండాలని.. అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని BMC సూచించింది.
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!