Sankranti Special Trains: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. 600 ప్రత్యేక రైళ్లు
- సంక్రాంతి రద్దీ దృష్ట్యా రైల్వేశాఖ కీలక నిర్ణయం..
- 600 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధం..
- దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankranti Special Trains: సంక్రాంతి పండుగ అంటే చాలు.. తెలుగువారంతా సొంత ఊళ్లకు బయలుదేరుతారు.. సిటీలు వదిలి పల్లెకు ప్రయాణం అవుతారు.. దీంతో, బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా ఎక్కడ చూసినా రద్దీ ఏర్పడుతుంది.. అంతేకాదు.. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే రోడ్లు సైతం వాహనాలతో కిక్కిరిసిపోతాయి.. అయితే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, అవసరాన్ని బట్టి ఈ సీజన్ మొత్తంలో జంట నగరాల నుంచి సుమారు 600 వరకు ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ పేర్కొన్నారు..
Read Also: Putin: పుతిన్ సమక్షంలోనే స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన జర్నలిస్ట్.. వీడియో వైరల్
Also Read
ఈ ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్, చర్లపల్లి, లింగంపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి నడవనున్నాయని వెల్లడించారు శ్రీధర్… సంక్రాంతి ప్రయాణానికి నెల రోజుల ముందుగానే ప్రత్యేక రైళ్లను ప్రకటించినట్లు తెలిపారు. అయితే, ముందస్తు బుకింగ్‌ల కారణంగా రిజర్వేషన్లు ఇప్పటికే వేగంగా నిండిపోతున్నాయని చెప్పారు. వెయిటింగ్ లిస్ట్ పరిస్థితిని బట్టి మరిన్ని ప్రత్యేక రైళ్లు ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం, తిరుపతి మార్గాల్లో ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉందని సీపీఆర్వో వెల్లడించారు. జనవరి 24వ తేదీ వరకు 400కు పైగా ప్రత్యేక రైళ్లు నడిపేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈసారి హైదరాబాద్ నుంచి రైళ్ల ద్వారా 30 లక్షల మందికిపైగా ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేశారు ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భద్రతా, సౌకర్య చర్యలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక రైళ్లలో అదనపు చార్జీలు వర్తిస్తాయని కూడా దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్‌గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
-
Nepal Floods: నేపాల్‌లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!