Terrorists Attack: కథువాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి.. ఇద్దరికి గాయాలు
- జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి
- కొండపై నుండి ఆర్మీ వాహనంపై కాల్పులు
- ఆర్మీ వాహనంపై గ్రెనేడ్లు విసిరిన టెర్రరిస్టులు
- ఇద్దరు భద్రతా బలగాలకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో సోమవారం ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదులు కొండపై నుండి ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారు. అంతేకాకుండా.. గ్రెనేడ్లు కూడా విసిరారని అధికారులు తెలిపారు. ఈ దాడి తర్వాత ఆ ప్రాంతంలో భారీ సెర్చ్, కార్డన్ ఆపరేషన్ ప్రారంభించినట్లు వారు తెలిపారు. గత కొన్ని వారాలుగా జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. గత నెల జూన్ 11, 12 తేదీల్లో జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రదాడులతో దద్దరిల్లింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
జూన్ 11న చత్తర్‌గల్లా వద్ద జాయింట్ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జూన్ 12న గండో ప్రాంతంలో ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడుల తరువాత.. భద్రతా బలగాలు తమ యాంటీ-టెర్రరిస్ట్ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఆ ప్రాంతంలో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్న నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు.
Read Also: Maharastra CM: నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అన్యాయాన్ని సహించేది లేదు..
జూన్ 26న జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్ 11, 12 తేదీలలో కొండ జిల్లాలో జరిగిన జంట ఉగ్రవాద దాడుల తరువాత ఆర్మీ-సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) తో పాటు పోలీసులు జరిపిన కార్డన్ ఆపరేషన్ లో ఉగ్రవాదులు హతమయ్యారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..