వామ్మో! సాలె పురుగు కుడితే ఇంత భయంకరంగా ఉంటుందా? ఒక మహిళను సాలె పురుగు కట్టడంతో ఆమె శరీరంలో ఎన్నో తీవ్రమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గుండె వేగం అసాధారణంగా పెరిగి, శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా తగ్గాయి. చివరికి ఆమెను వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చింది. ఆసుపత్రి నుంచి డిశార్జ్ అయిన తర్వాత, ఆమె చర్మం పొలుసులా ఊడిపోతుందని ఆమె స్వయంగా తెలిపింది. ఈ షాకింగ్ అనుభవాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రపంచంతో పంచుకుంది, ఇది ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇచ్చిన వివరాల ప్రకారం, విషపూరిత గోధుమ రంగు సాలె పురుగు ఆమెను కట్టింది. ఆ క్రమంలో ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలై, వారాల పాటు చికిత్స పొందిన తర్వాత కూడా విష ప్రభావం ఆమె శరీరంపై స్పష్టంగా కనిపించేవి. 2025 మే 17న, ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మైనిటా ఎస్ పూర్తిగా కోలుకున్నానని తన అనుభవాన్ని పంచుకున్నారు.
అకస్మాత్తుగా ఒక గోధుమ రంగు సింగిల్ సాలె పురుగు ఆమెను కుట్టిందని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో రెండు వారాల పాటు ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చిందన్నారు. అనంతరం ఆమె శరీరం ఒక క్షణం సాధారణంగా ఉండేది కాదని, మరో క్షణం కుంచుకుపోవడం జరిగేదని వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో ఆమెకు కళ్లు తెరవలేకపోయానన్నారు. గుండె రేట్ చాలా రోజులపాటు 140 నుంచి 160 మధ్య ఉండి, ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయాయని చెప్పుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే.. ఆసుపత్రి నుంచి డిశార్జ్ అయిన తర్వాత తన చర్మం పాములా పొలుసులుగా ఊడిపోడం ప్రారంభమైందని ఆమె ఆవేదనను పంచుకున్నారు..