ఢిల్లీ విమానాశ్రయంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఎయిరిండియాకు చెందిన పైలట్ దుశ్చర్యకు పాల్పడ్డాడు. కెప్టెన్ వీరేంద్ర సెజ్వాల్ తనపై దాడి చేశాడంటూ అంకిత్ ధావన్ అనే ప్రయాణికుడు మైక్రోబ్లాగింగ్‌లో ఆరోపించాడు. ఈ వార్త వైరల్‌గా మారడంతో ఎయిర్‌లైన్స్ సంస్థ చర్యలకు దిగింది. ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Putin: పుతిన్ సమక్షంలోనే స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన జర్నలిస్ట్.. వీడియో వైరల్
ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్- 1లో భౌతిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఒక ఉద్యోగిని అధికారిక విధుల నుంచి వెంటనే తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, విచారణలో అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ హామీ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల.. కొత్త ఫొటోల్లో బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్
‘‘ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన సంఘటనకు మేము తీవ్రంగా చింతిస్తున్నాము. మా ఉద్యోగి ఒకరు మరొక విమానయాన సంస్థలో ప్రయాణించే ప్రయాణీకుడిపై జరిగిన దాడి సంఘటన….. సంబంధిత ఉద్యోగిని తక్షణమే అధికారిక విధుల నుంచి తొలగించాం. సమగ్ర దర్యాప్తు జరిగే వరకు తగిన చర్యలు తీసుకోబడతాయి.’’ అని ఎయిర్‌లైన్ తన అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
బాధితుడు ధావన్ ప్రకారం.. భార్య, 4 నెలల శిశువు కోసం స్ట్రాలర్ అభ్యర్థించాడు. స్ట్రాలర్ (శిశువులు లేదా చిన్న పిల్లలను సులభంగా తీసుకువెళ్లడానికి ఉపయోగించే ఒక రకమైన వాహనం) ప్రత్యేక సహాయం కోసం ప్రయాణికులకు కేటాయిస్తారు. ఇక్కడే ఎయిరిండియాకు చెందిన ఓ పైలట్.. ధావన్ మధ్య గొడవ జరిగింది. స్ట్రాలర్ కోసం పీఆర్ఎం లైన్ అనుమతించాలని కోరినందుకు ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఎంట్రీ కేవలం సిబ్బంది కోసం అని కెప్టెన్ వీరేంద్ర గొడవ పెట్టుకున్నట్లు సమాచారం. ధావన్‌ను ఉద్దేశిస్తూ చదువురానివాడా? అంటూ దూషించినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఒక్కసారిగా సీరియస్‌గా మారడంతో ధావన్‌పై పైలట్ దాడికి పాల్పడ్డాడు. ఇంతలోనే ధావన్‌కు రక్తం కారిపోయింది.
చొక్కాపై రక్తపు మరకలు ఉన్న ఫోటోలను ధావన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దాడికి సంబంధించిన ఆధారాలు అని తెలిపాడు. దాడి కారణంగా తాను ప్లాన్ చేసిన సెలవు పోయిందని వాపోయాడు. వైద్య సహాయం కోసం ప్రయాణం ఆపుకోవాల్సి వచ్చిందని.. అంతేకాకుండా ఏడేళ్ల కుమార్తెకు గాయాలు కావడమే కాకుండా.. భయాందోళనకు గురైందని ధావన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి పైలట్లు విమానాలు నడిపితే గాల్లో ప్రయాణికుల పరిస్థితి ఏం కావాలని ధావన్ ప్రశ్నించాడు.
Here is a short video of Capt. Virender Sejwal looking at me lying on the floor, covered in blood, and probably realising the gravity of the situation for the first time.
And a few more things that I did not mention in my earlier post:
🔸 My wife kept requesting for first aid.… https://t.co/CXlrqchhxC pic.twitter.com/x49XtWvfpE— Ankit Dewan (@ankitdewan) December 20, 2025
@ankitdewan We profoundly regret this incident at Delhi Airport, involving one of our employees who was traveling as a passenger on another airline. We extend our heartfelt empathy for the distress it has caused, and strongly condemn such behaviour. The concerned employee has…
— Air India Express (@AirIndiaX) December 19, 2025
AIX Pilot, Capt. Vijender Sejwal pic.twitter.com/Ntp1pnDgdb
— Ankit Dewan (@ankitdewan) December 19, 2025