కిడ్నీ రాకెట్ కేసులో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. కిడ్నీ ఆపరేషన్ కోసం వసూలు చేసిన హాస్పిటల్ కోఆర్డినేటర్ అనిల్కు హాస్పిటల్కు ఎటువంటి సంబంధం లేదని హాస్పిటల్ యాజమాన్యం తేల్చి చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హాస్పిటల్లో పనిచేసిన అంత మాత్రాన హాస్పిటల్ కి ఏంటి సంబంధం అని అంటున్నారు యాజమాన్యం. అనిల్ ఆర్థిక లావాదేవీలకు తమకు ఎటువంటి సంబంధం లేదని, అనిల్ పాత్ర పై తమకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు.
ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీసీబీ ఓఎస్డీ (OSD) రామారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఘటన జరిగిన రోజే పీసీబీ ఉద్యోగులు నాగరాజు, రూపేంద్ర మీద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఓఎస్డీ రామారావుపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు పోలీసులు. గతంలో నమోదు 106 సెక్షన్ ను మార్చి కొత్తగా అదనపు సెక్షన్లను కలిపి ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రెండు రోజులు పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ మాచర్ల కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పిన్నెల్లిని ఈనెల 8, 9 తేదీల్లో నెల్లూరు జైల్లోనే విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. కారంపూడిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పై దాడితో పాటు, పాలవాయి గేట్ లో ఓ వ్యక్తిపై హత్యాయత్నం కేసులో పూర్తి దర్యాప్తు కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నాలుగు రోజులు కస్టడీకి కోరారు పోలీసులు.
రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు వీరి మధ్య భేటీ జరగనుంది. అయితే.. ఇద్దరి సీఎల మధ్య చర్చించాల్సిన అంశాలపై అజెండా ఖరారు అయింది. పది అంశాల అజెండాను తెలుగు రాష్ట్రాలు సిద్ధం చేశాయి. కాగా.. ఏపీ నుంచి సమావేశానికి మంత్రులు అనగాని, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరు కానున్నారు. అలాగే.. అధికారుల బృందంలో ఏపీ వైపు నుంచి సీఎస్, ఆర్దిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శులు హాజరు కానున్నారు.
మాస్ మహారాజ రవితేజ హీరోగా పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ కలయికలో వచ్చిన ధమాకా బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఆ చిత్రంలోని పాటలు,మాస్ స్టెప్పలతో సినీ ప్రేక్షకులతో విజిల్ కొట్టించాయి. అప్పటి వరకు వరుస పరాజయాలతో సతమతమవుతున్నరవితేజకు ధమాకా భారీ ఊరటనిచ్చింది. రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రవితేజను వందకోట్ల క్లబ్ హీరోగా మార్చింది ఆ చిత్రం.
గతంలో తిరుమల కాలినడక మార్గంలో ఓ చిన్నారిని చిరుత చంపి తిన్న విషయం తెలిసిందే.. లక్షిత అనే ఆరేళ్ల బాలికపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. అయితే.. భక్తులపై దాడికి పాల్పడటంతో అటవీ అధికారులు దానిని కొన్ని రోజులకు బంధించారు. అనంతరం.. నల్లమల అభయారణ్యంలో వదిలేశారు. అయితే.. ఆ చిరుతే మళ్లీ మనుషులపై దాడి చేస్తుంది. పచ్చర్లలో మెహరున్నీసా అనే మహిళను చంపి తింది. కాగా.. ఈ చిరుతను తిరుమలలో చిన్నారిని చంపి తిన్న చిరుతగా అటవీ అధికారులు నిర్ధారించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతుంది. బడ్జెట్ కసరత్తును ఓ కొలిక్కి తేలేకపోతోంది ఆర్థిక శాఖ. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాలా..? రెండు మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పెట్టాలా..? అనే కన్ఫ్యూజన్ లో ఆర్థిక శాఖ ఉంది. ప్రస్తుతం ప్రతిపాదనలకు పూర్తి వివరాల్లేకపోవడంతో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం కష్టమనే భావన వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతోనే సమస్య అని ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్…
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. జూలై 9,16వ తేదీలలో బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. 9వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. 16 వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.
పీసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఫ్యామిలీకి చెందిన కంపెనీల పర్యావరణ నిబంధనలపై ఆరా తీశారు. ద్వారంపూడి కుటుంబానికి చెందిన వీరభధ్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినట్లు పీసీబీ అధికారులు స్పష్టీకరణ చేశారు. వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదిలేస్తున్నట్లు గుర్తించారు. అనుమతుల ప్రకారం రోజుకి 25 టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 56 టన్నులు ఉత్పతి చేస్తున్నారని పీసీబీ నివేదిక ఇచ్చింది.
పాకిస్థాన్‌లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. 1981లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఐఏ) విమానాన్ని హైజాక్ చేసిన వాంటెడ్ టెర్రరిస్ట్ గజిందర్ సింగ్ (74) మరణించాడు. పాకిస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో గుండెపోటుతో ఆయన మరణించినట్లు సమాచారం. గజిందర్ సింగ్ ఒక పేరుమోసిన ఉగ్రవాది, అతను ఖలిస్తాన్ అనుకూల సంస్థ "దాల్ ఖల్సా" సహ వ్యవస్థాపకుడు. 1981లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ-423 హైజాక్‌లో ప్రధాన కుట్రదారుల్లో ఇతను ఒకడు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళుతున్న విమానం హైజాక్‌కు గురై పాకిస్థాన్‌లోని లాహోర్‌కు దారి మళ్లించారు.