భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల హవా కొనసాగుతుంది. ఎప్పటికప్పుడూ ఒకదానికొకటి కంటే ఎక్కువ ఫీచర్లు, మైలేజ్, సేఫ్టీ ఫీచర్లు ఉండే కార్లను ఆటోమొబైల్ కంపెనీలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ "బెస్ట్యూన్" తన కొత్త చిన్న ఎలక్ట్రిక్ కారును 2023లో విడుదల చేసింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. వర్షం కారణంగా ఆట రద్దైంది. 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 12.5 ఓవరల్లో ఒక వికెట్ కోల్పోయి 109 పరుగులు చేసింది. అయితే వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుత రోజుల్లో కారు వినియోగం అనేది సర్వ సాధారణంగా మారింది. ప్రజల ఆదాయం పెరగడంతో పాటు అవసరాలు, తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరడం కోసం ప్రతి ఒక్కరూ కారును వాడుతున్నారు. మైలేజీ బాగా వచ్చినప్పుడు మనకు ప్రయోజనం కలుగుతుంది. అయితే.. వేసవి కాలం వచ్చిందంటే చాలు కార్లలో మైలేజ్ తగ్గుతుంది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు పూర్తి విఫలమైంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఈ క్రమంలో జట్టు కెప్టెన్ బట్లర్ పై విమర్శలు వచ్చాయి. దీంతో.. జోస్ బట్లర్ వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు.
ఐపీఎల్ 2025లో రవిచంద్రన్ అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరపున ఆడనున్నాడు. కాగా.. 2009లో సీఎస్కే తరుఫున అశ్విన్ అరంగేట్రం చేశాడు. 2015 వరకు ఏడు సీజన్లు చెన్నైకి ఆడాడు. ఆ తర్వాత 2016, 2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. 2018లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.
ఐదు రోజుల క్రితం ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కాస్ట్లీ డ్రెస్సింగ్ స్టైల్‌తో కనిపించాడు. అతన్ని చూసిన వారంతా బాగున్నాయ్ అంటూ ప్రశంసించారు. చివరకు పాక్ మాజీ దిగ్గజం వసీం అక్రం సైతం అభిషేక్ శర్మ డ్రెస్సింగ్ స్టైల్‌ను అభినందించారు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL 2025) షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 11న రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్‌తో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ లీగ్‌లో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగుతాయి. మే 13, 14, 16 తేదీల్లో క్వాలిఫైయర్.. ఎలిమినేటర్ 1, ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రాండ్ ఫినాలే మే 18న లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరగనుంది.
విరాట్ కోహ్లీ తన వన్డే క్రికెట్ కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ 3000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఐదవ బ్యాట్స్‌మన్‌గా నిలవడానికి ఇంకా 85 పరుగులు మాత్రమే అవసరం.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా తదుపరి మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరాయి. కాగా.. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడకపోవచ్చు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మకు ఈ మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చని సమాచారం.